Home తాజా వార్తలు వాలెంటైన్స్ డే రోజున నెక్స్ మూవీ

వాలెంటైన్స్ డే రోజున నెక్స్ మూవీ

allu arjun trivikramస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత బన్నీ ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించలేదు. మంచి కథ కోసం ఆయన ఎదురు చూశారు. దర్శకులు విక్రమ్ కుమార్, పరశురామ్ పేర్లు వినిపించినా చివరికి త్రివిక్రమ్‌కు బన్నీ నెక్స్ మూవీని తెరకెక్కించే అవకాశం దక్కింది. ఇక అల్లుఅర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వీరి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న అంటే వాలెంటైన్స్ డే రోజున ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరిలో సినిమాను ప్రారంభించి దసరా పండుగకు రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఈసారి అల్లుఅర్జున్, త్రివిక్రమ్‌లు ఇండస్ట్రీ హిట్‌పై కన్నేశారు.

allu arjun trivikram film starts valentines day