Search
Monday 24 September 2018
  • :
  • :

అల్లు అర్జున్-లింగుస్వామిల ద్విభాషా చిత్రం

allu-arjunవరుస హిట్స్‌తో దూకుడుమీదున్న అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియోగ్రీన్ ప్రొడక్షన్ నం.12 చిత్రంగా జ్ఞానవేల్ రాజా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ 18వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. తెలుగుతో పాటు ఇప్పటికే మలయాళం, కన్నడ భాషల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న బన్నీ ఈ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీనిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ “తమిళంలో ఎంట్రీ ఇచ్చే విషయంలో చాలా ఆలోచించాం. ఓ మంచి డైరెక్టర్ ద్వారా పరిచయం కావాలనుకున్నాను. నన్ను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న లింగుస్వామి, జ్ఞానవేల్ రాజాకు ప్రత్యేక ధన్యవాదాలు”అని అన్నారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ “అల్లు అర్జున్‌ను తమిళంలో పరిచయం చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫిబ్రవరి ద్వితీయార్థంలో లేదా మార్చి ప్రథమార్థంలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాం”అని తెలిపారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ “నేను ఇప్పటివరకు కలిసిన స్టార్స్‌లో మోస్ట్ ఎనర్జిటిక్, హార్డ్‌వర్కింగ్ స్టార్ అల్లు అర్జున్. చెన్నైలో చాలా మందికి బన్నీ యాక్టింగ్, డ్యాన్సులంటే ఇష్టం. అందుకే ఓ మంచి కథతో ఆయనతో సినిమా చేయాలనుకున్నాం. అలా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యింది”అని చెప్పారు. ఇక అల్లు అర్జున్ తమిళంలోకి ఎంట్రీనివ్వడంపై సీనియర్ నటుడు శివకుమార్ సంతోషం వ్యక్తంచేశారు. ఈ చిత్రంతో అతను తమిళ ప్రేక్షకుల మనసులు దోచుకుంటారని అన్నారు.

Comments

comments