Home తాజా వార్తలు అల్లు శిరీష్‌ ‘ఎబిసిడి’ ట్రైలర్.. ఫుల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌…

అల్లు శిరీష్‌ ‘ఎబిసిడి’ ట్రైలర్.. ఫుల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌…

ABCDహైదారాబాద్‌: సంజీవ్‌ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఎబిసిడి’. ‘అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ లో శిరీష్ చెప్పిన ‘నేను జీవితంలో మూడు ‘E’లను ఫాలో అవుతుంటాను. ఎంజాయ్‌మెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎగ్జైట్‌మెంట్‌’తో పాటు చివర్లో ‘డ్యాడ్‌.. నువ్వు ‘స్వయంకృషి’లో చిరంజీవిలా ఫీలవ్వకు. కష్టాల్లోకి తోసేస్తే మారిపోతానని అనుకోకు. నేను రిచ్‌గానే పుట్టాను, రిచ్‌గానే పెరిగాను, రిచ్‌గానే ఉంటాను’ అనే డైలాగ్స్ బాగున్నాయి. అమెరికాలో ఉన్నత కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు ఇండియాకు వచ్చి మధ్య తరగతి జీవితం గడపలేక ఎలా సతమతమయ్యాడు?, ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులేంటి?అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. శిరీష్ సరసన రుక్సార్‌ ధిల్లన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర ముఖ్యపాత్రల్లో మాస్టర్‌ భరత్‌, నాగబాబు, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్‌, రాజా తదితరులు నటించారు. ఈ సినిమా మే 17న విడుదల కానుంది.

Allu Sirish ABCD Theatrical Trailer is Released