Search
Wednesday 14 November 2018
  • :
  • :

‘ఒక్క క్షణం’ ఫస్ట్‌లుక్

Okka-Kshanam

అల్లు శిరీష్ హీరోగా సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఒక్క క్షణం’. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి మాట్లాడుతూ “ఇటీవల విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు హీరోహీరోయన్‌తో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశాం. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది పోస్టర్. త్వరలోనే ఓ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నా యి. డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి”అని అన్నారు. శ్రీనివాస్ అవసరాల, కాశీ విశ్వనాథ్, రోహిణి, జయప్రకాష్, ప్రవీణ్, సత్య, సుదర్శన్, వైవా హర్ష, ప్రభాస్ శ్రీను ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: మణిశర్మ, మాటలు: అబ్బూరి రవి, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్.

Comments

comments