Home జాతీయ వార్తలు అలోక్ వర్మ జారీ చేసిన బదిలీలు రద్దు

అలోక్ వర్మ జారీ చేసిన బదిలీలు రద్దు

 

M Nageswara-rao

 

న్యూఢిల్లీ: తన రెండు రోజుల విధి నిర్వహణలో సిబిఐ డైరెక్టర్‌గా చేపట్టిన బదిలీలన్నటినీ తాత్కాలిక సిబిఐ డెరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు శుక్రవారం రద్దు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం సిబిఐ డైరెక్టర్‌గా తిరిగి విధుల్లోకి చేరిన అలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం రాత్రి బర్తరఫ్ చేసింది. రెండేళ్ల కాలపరిమితి ముగియకముందే బర్తరఫ్‌కు గురైన తొలి సిబిఐ డెరెక్టర్ అలోక్ వర్మ మాత్రమే. అలోక్ వర్మను అగ్నిమాపక సర్వీసుల డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. సిబిఐ డెరెక్టర్‌గా బుధవారం తిరిగి విధుల్లో చేరిన వర్మ దాదాపు 24 బదిలీ ఉత్తర్వులపై సంతకాలు చేశారు.

Alok Verma Issue Orders Cancelled by M Nageswar Rao, Alok Verma was Divested from CBI Director and Transferred as DG of Fire services