Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

డీలర్లుకు ప్రభుత్వం షాక్..!

Joint-collector-Damodar-Red

నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు
జిల్లా జాయింట్ కలెక్టర్ దామోదర్‌రెడ్డి
గ్రామైక్య, పట్టణ సమాఖ్య, పిఎసిఎస్‌లకు నిర్వహణ బాధ్యత
జిల్లాలో 553 చౌకదుకాణాలకు సరుకుల పంపిణీ
అవసరమైనచోట్ల పోలీసు రక్షణ

మన తెలంగాణ/మహబూబాబాద్: జూలై 1నుండి చౌకధరల డీలర్లు సమ్మె చేయబోతున్నందున నిత్యావసర వస్తువులు పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర కట్కూరి దామోదర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పౌరసరఫరాల జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, కోఆపరేటివ్, ఐకెపిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి జిల్లా యంత్రాంగానికి అందించిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ జిల్లాలోని కోఆపరేటివ్, ఐకెపి వ్యవస్థ ద్వారా చౌకధరల డీలర్లకు ప్రత్యామ్నాయంగా నిత్యావసర సరుకుల పంపిణీ ఏర్పాటుకు నిర్ణయించడం జరిగిందని చెప్పారు. గ్రామైక్య సంఘాలు పట్టణ సమాఖ్యలు, పిఎసిఎస్‌ల ద్వారా జిల్లాలోని 563 చౌకధరల దుకాణాలను నిర్వహించేందుకు విధి విధానాలను ఈ సందర్బంగా జెసి వివరించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఎప్పటి మాదిరిగానే సరుకులు పంపిణీ చేయాలని చెప్పారు. ఈ నెల 27న సంబంధిత జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది, ఈనెల 29న మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జెసి తెలిపారు. అలాగే గ్రామైక్య సంఘాలకు, ఐకెపిలకు రేషన్ షాపుల నిర్వహణపై రెండు రోజులపాటు శిక్షన ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామాలవారీగా గ్రామ సమైక్య సంఘాలు మెప్మావారు పాపుల వారీగా ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రదేశాలను ఈనెల 28లోగా ఎపిఎం, సిసిల సహాయంతో గుర్తించాలని తెలిపారు. డిఆర్‌డిఏ ప్రాజక్టు అధికారి, మెప్పామ అధికారులు ప్రతి షాపుల నిర్వహణకు ఇద్దరు చొప్పున పేరు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్‌తో ఈనెల 28లోగా జిల్లా పౌరసరఫరాల అధికారికి అందించాలని తెలిపారు. చౌకధరల షాపు నిర్వహించే సంఘాలకు అవసరమైన సరుకులకు సంబంధించిన మొత్తం మీ సేవా కేంద్రాల్లో జూలై 1 నుండి 3 వరకూ చెల్లించి తహసీల్దారు ద్వారా రిలీజ్ ఆర్డర్ సంబంధిత యంఎల్‌ఎస్ పాయింట్‌కు పంపించి ఈనెల 30 నుండి జూలై 4వ తేదీలోగా సరుకులు రేషన్ షాపులకు ఇచ్చేలా చూడాలని జెపి చెప్పారు. జూలై 5నుండి 10 వరకూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని తెలిపారు. నిత్యావసర సరుకులు పంపిణీ సజావుగా జరిగేందుకు జిల్లా స్థాయి అధికారులైన జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లియిస్, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి, మండల ప్రత్యేక అధికారులు తగిన పర్యవేక్షణ నిర్వహించనున్నట్లు, ఈనెల 30నుండి వచ్చేనెల 4వ తేదీ వరకూ సరుకులు రవాణా చేయాలని, చౌకధర దుకాణా లకు పంపే బియ్యం ఇతర సరుకులు గోదాంలో తగినంత ఉండేటట్లు రవాణాకు అవసరమైన వాహనాలను, హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా మేనేజర్ సివిల్ సప్లయిస్ కార్పోరేషన్‌ను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ది పౌరసరఫరాలు, రెవిన్యూ, కోఆపరేటివ్ శాఖల ద్వారా జిల్లా, మండలాల, గ్రామ, స్థాయిల్లో సమీప పర్యవేక్షణ నిర్వహించి సరుకులు రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు జెసి తెలిపారు. సరుకుల పంపిణీలో ఎలాంటి ఆటంకం కలుగకుండా అవసరమైతే పోలీసు రక్షణ, పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు జెసి తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ రాంబాబు, డిఆర్‌డిఓ గణేష్, డిసిఓ ఇందిర, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ డిఎం మహేందర్, డిఎస్‌డిఓ నర్సింహారావు, సిపిఎసిఎస్, ఐకెపి, గ్రామ సమైక్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పంపిణీకి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు
నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.దామోదర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జెసి డీలర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎప్పటి మాదిరిగానే సరుకులు అందజేయాలని ప్రత్యామ్నాయన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్కడైనా విఘాతం కలిగించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంతో డిఆర్‌ఓ రాంబాబు, డిఎస్‌డిఓ నర్సింహారావు, చౌకధర డీలర్లు పాల్గొన్నారు.

Comments

comments