Home బిజినెస్ మూడో స్థానంలో అంబానీ ఫ్యామిలీ

మూడో స్థానంలో అంబానీ ఫ్యామిలీ

ambani-familyవాషింగ్టన్ : ఆసియాలో ఫోర్బ్స్ సంపన్నుల జాబితా లో ఈసారి 14 భారతీయ కుటుంబాలు స్థానం దక్కిం చుకున్నాయి. వీరిలో 21.5 బిలియన్ డాలర్ల(రూ.1.3 లక్షల కోట్లు) ఆస్తులతో అంబానీ కుటుంబానికి మూ డో స్థానం దక్కింది.  తొలి 50 మంది జాబితాలో భార తీయ కుటుంబాలు పద్నాలుగు ఉండడం గమనార్హం. 17 బిలియన్ డాలర్ల(రూ.1.1 లక్షల కోట్లు) విలువ చేసే ఆస్తులతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 15 బిలియన్ డాలర్ల ఆస్తులతో హిందూజా తొమ్మిదో స్థానం, 14.9 బిలియన్ డాలర్ల ఆస్తులతో మిస్త్రీ పదో స్థానం దక్కించుకున్నారు. ఆసియాలో సంపన్న కు టుంబాల్లో సగం వరకు చైనా జాతీయులే ఉన్నప్పటికీ వారంతా ప్రధాన భూభాగం చైనాకు చెందినవారు కాదు. సామ్‌సంగ్ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న దక్షిణ కొరియా లీ కుటుంబం జాబితాలో మొదటి ర్యాంకును సాధించింది. వీరి ఆస్తులు విలువ 26.6 బిలియన్ డాలర్లు(రూ.1.7 లక్షల కోట్లు)గా ఉంది. హాంకాంగ్‌కు చెందిన హెండర్సన్ ల్యాండ్ డెవలప్‌మెం ట్‌ను నిర్వహించే లీ కుటుంబం 24.1 బిలియన్ డాలర్ల ఆస్తులతో రెండో ర్యాంకును పొందింది. సోద రులు ముఖేష్, అనీల్ అంబానీల ఆస్తులను కలుపు కొని అంబానీ కుటుంబం మూడో స్థానం దక్కించుకో గా, వీరికి వారసత్వంగా ఈ ఆస్తి సంక్రమించింది. 2002 సంవత్సరంలో తండ్రి దివంగతులైన తర్వాత వీ రు వారసత్వ ఆస్తులను పంచుకుని వేర్వేరుగా వ్యాపా రాలు చేస్తున్నారని ఫోర్బ్ తెలియజేసింది. తొలి వర సలో నిలిచిన భారతీయుల పేర్లు, వారి ఆస్తుల వివరా లు ఇలా ఉన్నాయి.  మూడో ర్యాంకులో అంబానీల కు టుంబం(21.5 బిలియన్ డాలర్లు), ఏడో ర్యాంకులో ప్రేమ్‌జీ కుటుంబం(17 బిలియన్ డాలరు), పదో ర్యాంకులో మిస్త్రీ కుటుంబం(14.9 బిలియన్ డాల రు), 15వ ర్యాంకులో గోద్రెజ్ కుటుంబం(11.4 బిలి యన్ డాలరు), 19వ ర్యాంకులో మిట్టల్ కుటుం బం(10.1 బిలియన్ డాలరు), 22వ ర్యాంకులో బిర్లా కుటుంబం(7.8 బిలియన్ డాలరు), 29వ ర్యాంకులో బజాజ్ (5.9 బిలియన్ డాలరు), 30వ ర్యాంకులో డాబర్ ఇండియాకు చెందిన బర్మన్ కుటుంబం (5.5 బిలియన్ డాలరు), 33వ ర్యాంకులో కాడిలా హెల్త్‌కేర్‌కు చెందిన పంకజ్‌పటేల్ కుటుంబం(4.8 బిలియన్ డాలరు), 40వ ర్యాంకులో ఐషర్ గ్రూపుకు చెందిన లాల్‌ల కుటుంబం(4 బిలియన్ డాలరు), 42వ ర్యాంకులో శ్రీ సిమెంట్స్‌కు చెందిన బంగూర్ కుటుంబం(3.9 బిలియన్ డాలరు), 43వ ర్యాంకులో జిందాల్ కుటుంబం(3.8 బిలియన్ డాలరు), 46వ ర్యాంకులో ముంజాల్ కుటుంబం(3.2 బిలియన్ డాలరు), 50 ర్యాంకులో సిప్లాకు చెందిన హమీద్స్ ఫ్యామిలీ(2.9 బిలియన్ డాలరు) ఉన్నాయి.