Search
Wednesday 21 November 2018
  • :
  • :

‘అమర్ అక్బర్ ఆంటోని’ టీజర్ కుమ్మేసిందిగా!

Amar Akbar Anthony Movie

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగినట్టుగానే మూడు డిఫరెంట్ లుక్స్ తో రవితేజ ఆకట్టుకున్నాడు. ‘మనకి నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మనచుట్టూ వున్న బలగం కాదు .. మనలోని బలం’ అని రవి చెప్పిన డైలాగ్ బాగుంది. లవ్, ఎమోషన్, యాక్షన్  ప్రధానంగా ఈ టీజర్ ను వదిలారు. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటించింది. నవంబర్ 16న సినిమా విడుదల కానుంది. ఇక వరుస పరాజయాలతో డీలాపడ్డ దర్శకుడు శ్రీను వైట్లతో పాటు హీరో రవితేజకు ‘అమర్ అక్బర్ ఆంటోని’ విజయం ఎంతో కీలకం. అయితే, టీజర్ చూస్తుంటే ఈసారి శ్రీను, రవి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Amar Akbar Anthony Teaser Released

Comments

comments