Home secunderabad చరిత్రకు చిహ్నంగా అమర జవాన్ల స్థూపం…

చరిత్రకు చిహ్నంగా అమర జవాన్ల స్థూపం…

Amar Jawan Stupam

 

కంటోన్మెంట్: భారత దేశాన్ని శత్రు దేశాల నుంచి రక్షించడంలో జవాన్లది కీలక పాత్ర. దేశ సరిహద్దుల్లో నిరంతరం ఆయుధాలతో గస్తీ తిరుగుతూ… ఎండ, వాన, చలి కాలాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్దతతో విధులు నిర్వర్తిస్తుంటారు మన జవానులు. దేశ విదేశాల మద్య యుద్దాలు జరిగినప్పుడు శత్రు దేశాల నుంచి మన దేశాన్ని రక్షించడానికి వీరోచితంగా పోరాడి ప్రాణాలను పోగోట్టుకుంటున్నారు. మన జవానులు యుద్దంలో పోరాడి నాటి నుంచి నేటి వరకు ప్రాణాలను దేశ ప్రజల రక్షణ కోసం వీర మరణం పోందుతున్నారు. దేశంలో ప్రజలు సుఖ: శాంతులతో జీవించాలని ప్రజలకు రక్షణ కల్పించడంలో కుటుంబాలకు దూరంగా విధి నిర్వహణలో ఉంటు జవానులు చేస్తున్న ప్రాణ త్యాగం ఎన్నటికి మరువలేనిది… మరుపు రానిది. మొదటి ప్రపంచ యుద్దం, రెండవ ప్రపంచ యుద్దంలో పోరాడి ఎందరో జవాన్లు వీర మరణం పోందారు. అలాంటి జవానుల వీరత్వాన్ని చిరకాలం గుర్తుండేలా, వారి పోరాటం భావితరాలకు తెలిసే విధంగా చరిత్రలో చిహ్నంగా ఉండేందుకు హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక స్ఠూపాన్ని నిర్మించారు.

1939 నుంచి 1945 మద్య జరిగిన రెండవ ప్రపంచ యుద్దంలో పారాడి అమరులైన వీర జావానులను స్మరించుకోవడానికి, త్యాగం తరతరాలుగా ప్రజలకు తెలియపరచడానికి వారి మరణానికి గుర్తుగా ఫరెడ్ మైదానం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన స్థూపాన్ని ఏర్పాటు చేశారు. 1950లో ఆర్మికి అధికారులు 20.5 మీటర్ల ఎత్తుతో చరిత్రకు గుర్తుగా స్థూపాన్ని నిర్మించారు. ఈ స్థూపానికి 1939 నుంచి 1945 మద్యన జరిగిన రెండవ ప్రపంచ యుద్దం యొక్క విశిష్టతను తెలిపే విధఃగా తెలుగు, కన్నడ, ఉర్థూ, ఇంగ్లీష్, మరాఠి, భాషలల్లో చెక్కించారు. సంవత్సరాలు గడిచినా చరిత్రను తెలిపే విధంగా రహదారి పక్కన తరతరాలు చెక్కు చెదరకుండా బండరాయితో ఎంతో అందంగా అమర వీర జావానుల స్థూపాన్ని నలువైపులా ఒకే విధంగా కన్పించేలా నిర్మించారు.

Amar Jawan Stupam in Secunderabad Pared Ground