Home ఆఫ్ బీట్ అంతరిక్షంలో ఆకుకూరలు..

అంతరిక్షంలో ఆకుకూరలు..

Astronuts

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ( ISS ) నందు నాసా శాస్త్రజ్ఞులు  లెట్టూస్ వంటి ఆకుకూరలను పండిస్తున్నారు. దీని వలన వ్యోమగాములు తాజాగా తమ ఆహారాన్ని తయారుచేసుకోగలుగుతారు.  భూమిపై రైతులు ఎలా ఆకుకూరలను పండిస్తారో, అదే విధంగా ISS లోని వ్యోమగాములు ఎరుపు రంగులోని లెట్టూస్‌ని పండిస్తున్నట్లు తెలిపారు. షేన్ కింబ్రో తన వెజ్- 03 ప్రయోగంలో భాగంగా రకరకాలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ఈ ప్రయోగాలను మిగిలిన వ్యోమగాములు తమ స్థావరాలలో ( కెన్నడీ స్పేస్ సెంటర్, ఫోరిడా) నుంచి  వీక్షిస్తున్నారు.  నికోల్ డ్యుఫోర్,  నాసా వెజ్జీ ప్రాజెక్టు మేనేజర్ ఈ ప్రయోగాలు బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చాయని తెలిపారు.  మొక్కల కుండీలలో ముందుగానే ఎరువులు, ఇతర అవసరాలను కలిపి ఉంచినట్లు, వ్యోమగాములు కేవలం కొద్ది మోతాదులో నీటిని చిలకరిస్తే సరిపోతుందని వారు తెలిపారు.  ఈ ప్రయోగం 2015 నాటి వెజ్- 01 వంటి సత్ఫలితాలను  ఇచ్చినట్లు హర్షం వ్యక్తపరిచాయి.  మొక్కలను నాలుగు వారాల తర్వాత మిగతా ప్రయోగాలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రయోగం అంగారక గ్రహానికి ప్రయాణించే వ్యోమగాముల ఆహారపు అవసరాలను తీరుస్తుందనే ధీమాను శాస్త్రజ్ఞులు వ్యక్తం చేస్తున్నారు.