Home వరంగల్ రైతులకు మరో అద్భుత పథకం సబ్సిడీపై పాడి పశువులు

రైతులకు మరో అద్భుత పథకం సబ్సిడీపై పాడి పశువులు

amazing scheme for farmers is dairy cattle on subsidies

నీళ్లు, నిధులు, నియామకాల గురించే తెలంగాణ సాధించుకున్నాం
నేషనల్ కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ ద్వారా రూ. 800కోట్ల రుణాలు
విలేకరుల సమావేశంలో కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్

మనతెలంగాణ/ ఎల్కతుర్తి : తెలంగాణ రైతాంగాన్ని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తూ అనేక విధాలుగా ఆదుకుంటోందని కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రైతుబంధు పథకంతో పాటు రూ. 5లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల మన్ననలు పొందిందన్నారు. ఇదేకోవలో మరో బృహత్తర పథకానికి సిఎం శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇందులో నేషనల్ కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ కోఆపరేషన్ ద్వారా సిఎం కెసిఆర్ రూ. 800కోట్ల రుణాలను తీసుకొచ్చారని, వీటితో మొదటి విడతగా విజయడైరీ, కరీంనగర్, ముల్కనూర్ డైరీలతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని మదర్ డైరీ సభ్యులకు పాడి గేదెలు లేక ఆవులను బిసిలు, ఇతరులకు 50శాతం, ఎస్సీఎస్టీలకు 75శాతం సబ్సిడీలతో అందించేందుకు ప్రణిళిక రూపొందింపబడిందని ఆనందం వ్యక్తం చేశారు. నూతన ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు అందించనున్నామన్నారు. దీన్ని సెంట్రల్ వాట ర్ కమీషన్‌తో పాటు ఇతర రాష్ట్రాలు ముచ్చుకుంటున్నాయని వెల్లడించారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటిమయమవుతుందని కాంగ్రెస్ చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారని, ఇప్పుడు రాష్ట్రంలో సీఎం 24గంటల కరెంటును అందిస్తున్నారని వివరించారు. కరెం ట్ ఉత్పత్తి కేంద్రాలకు నిధులు మంజూరీ చేయించి మరో రెండేళ్లలో ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం తయారు కానుందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వేలకోట్ల రూపాయలను అప్పుగా తీసుకొస్తున్నామని, అయితే దీనిపై ప్రతిపక్షాలు రాద్దా ంతం చేస్తున్నాయన్నారు. అయితే రుణాలు చెల్లించే వారికి మాత్రమే ఇస్తారన్న విషయాన్ని విమర్శించే వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పాడి పంట అన్నారని, అయితే ప్రస్తుతం పంట మాత్రము ఉందని, పాడి గాడితప్పిందన్నారు. దీన్ని తిరిగి పాడిపంటగా మార్చి కేవలం పంటలతోనే కాకుండా రైతు పాడి పశువుల ద్వారా సైతం ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడే విధంగా ఈ పథకం రూపొందించబడుతోందన్నారు. సబ్సిడీ కింద ఇచ్చే పశువులను హర్యా న, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేందుకు, రైతులను అనువుగా ఉండే విధంగా ప్రత్యే రైళ్లను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండో విడత ఆసక్తిగల రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ తంగెడ శాలిని, మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో ఇందుమతి, తహశీల్దార్ మల్లేశం, రైతు సమితి మండల కోఆర్డినేటర్ బచ్చు కిషన్‌రావు, నాయకులు గోల్లె మహేందర్, ఎంపీటీసీ వేముల శ్రీనివాస్, ముద్దరబోయిన వెంకటేశ్‌యాదవ్, రవీందర్, శ్రీకాంత్‌గౌడ్, డుకిరె రాజేశ్వర్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల నాయకులు పాల్గొన్నారు.