Home తాజా వార్తలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్…

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్…

Amazon Great Indian Festival Sale

ముంబయి: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను మరోసారి ప్రారంభించింది. ఇటీవలే  దసరా పండగను పురస్కారించుకొని ఈ సేల్‌ను నిర్వహించగా, రాబోతున్న దీపావళి పండుగ సందర్భంగా మరోసారి సేల్‌ను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే బుధవారం ప్రారంభమైన ఈ సేల్ అక్టోబర్ 28వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా అనేక రకాల ప్రొడక్ట్స్‌పై ఆకట్టుకునే అద్భుతమైన ఆఫర్లు, డిస్కాంట్ లను అందిస్తోంది అమెజాన్.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ధరలతో అందిస్తున్నారు. ఐఫోన్ X 64జిబి వేరియెంట్ రూ.74,999 ధరకే కస్టమర్లకు లభిస్తున్నది. అలాగే గెలాక్సీ ఎస్9 ప్లస్ 64 జిబి రూ.61,990 ధరకు, హువావే పి20 ప్రొ రూ.54,999 ధరకు, వన్ ప్లస్ 6 8జిబి, 128 జిబి వేరియెంట్ రూ.34,999 ధరకు, గెలాక్సీ నోట్ 8 6జీబీ + 64జిబి రూ.43,990 ధరకు వినియోగదారులకు లభిస్తున్నాయి.

ఇంతేకాకుండా గెలాక్సీ ఎ8 ప్లస్ రూ.23,999, హానర్ ప్లే 4జిబి + 64జిబి రూ.17,999, హువావే నోవా 3ఐ రూ.17,990, హువావే పి20 లైట్ రూ.15,999, షియోమీ ఎంఐ ఎ2 రూ.14,999, మోటో జి6 4జిబి+64 జిబి రూ.13,999, షియోమీ రెడ్‌మీ వై2 4జిబి+64జిబి రూ.10,999, రియల్ మి1 4జిబి+64జిబి రూ.9,990, హానర్ 7సి 3జిబి+32జిబి రూ.8,499 ఫోన్లు కూడా తక్కువ ధరలకే కస్టమర్లకు లభిస్తున్నాయి.

అమెజాన్ సేల్‌లో ఎంఐ పవర్ బ్యాంకులు, బ్లూటూత్ హెడ్‌సెట్లు, టివిలు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, కెమెరాలు, కెమెరా యాక్ససరీలు, గేమింగ్ కన్సోల్స్, ప్రింటర్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్ లో పలు ప్రొడక్ట్స్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఐసిఐసిఐ లేదా సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి వస్తువులను కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ను అందిస్తుంది అమెజాన్.

Amazon Great Indian Festival Sale

telangana latest news