
ముంబయి: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా మరో అద్భుతమైన ఆఫర్ ను తీసుకొచ్చింది. అయితే, ఈసారి అది ఆన్లైన్ షాపింగ్ కోసం కాదులేండి. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కోసం. అమెజాన్ ప్రైమ్ వీడియో పేరుతో ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా సినిమాలు, వీడియోలు, వెబ్ సిరీస్లను ఉచితంగా చూసే వెసులుబాటును అమెజాన్ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తీసుకొచ్చిన ఆఫర్ కింద కేవలం రూ.129కే నెల రోజుల ప్రైమ్ సభ్యత్వాన్ని అందించనుంది. కాగా, ఇంతకుముందు ఇది రూ.499 ఉండగా, ఇప్పుడు రూ.129కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేగాక అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్నవారికి అమెజాన్ సైట్లో కొనుగోలు చేసే వస్తువులపై ఉచిత డెలివరీ సదుపాయం కూడా ఉంటుంది. ఇక ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కావాలనుకునే వారు రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.