Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

అమెజాన్ ఇండియాకు   నికర నష్టాలు రూ.1,724 కోట్లు

amzonన్యూఢిల్లీ : అమెజాన్ ఇండియా నికర నష్టాలు మరింతగా పెరిగాయి. 2015 మార్చి ముగింపు నాటికి భారత్ వ్యాపారంలో సంస్థకు నష్టం రూ.1,724 కోట్లకు పెరిగింది. అయితే దేశంలోని ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సహా బిగ్ 3 కంపెనీల మొత్తం నష్టం రూ.5,052 కోట్లకు చేరింది. భారీ డిస్కౌంట్లతో కొనుగోలుదారులను ఆకర్షించే ఈ సంస్థలు పోటీపడ్డాయి. కానీ లాభాలను అందుకోలేకపోయాయి. అయితే 2014-15 సంవత్సరంలో అమేజాన్ ఇండియా అమ్మకాలు రూ.1,022 కోట్లతో ఆరు రెట్లు పెరిగాయి. అంతకుముందు సంవత్సరంలో ఈ సంస్థ అమ్మకాలు రూ.169 కోట్లుగానే ఉన్నాయి. అమ్మకాల కమిషన్లు, ప్రకటనల ఆదాయం, పోర్టల్‌పై ఇ-రీడర్ సేల్స్ నుంచి కంపెనీ ఆదాయాన్ని ఆర్జించింది. సంవత్సరం క్రితం నికర నష్టం రూ.321 కోట్లుగా ఉంది. మార్కెట్‌లో రెండు ఆన్‌లైన్ సంస్థలపై ఆధిపత్యం చెలాయిస్తున్న ఫ్లిప్‌కార్ట్ మార్చి ముగింపునాటికి రూ.2000 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఈ సంస్థ నష్టం రూ.715 కోట్లుగా ఉంది. ఇక మార్చి ముగింపు నాటికి స్నాప్‌డీల్ రూ.1,328 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. దేశంలో అత్యంత ఎక్కువ మంది వీక్షించే పోర్టల్‌గా అమేజాన్ నిలిచిందని, ఇతర సంస్థలతో పోలిస్తే యాప్‌లలోనూ వేగవంతంగా పుంజుకుందని అమేజాన్ ఇండియా ప్రకటించింది.

Comments

comments