Home బిజినెస్ అంతర్జాతీయంగా అమెజాన్ ఢమాల్…

అంతర్జాతీయంగా అమెజాన్ ఢమాల్…

AMAZON

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అంతర్జాతీయ కార్యకలాపాల్లో తీవ్రమైన నష్టాలు ఎదుర్కొటుంది. జూన్‌ క్వార్టర్‌ ఫలితాల్లో సంస్థ నికర లాభాలు 77 శాతం కోల్పోయి, రూ.1264 కోట్లగా నమోదయ్యాయి. అయినప్పటికీ ఈ ఈ-కామర్స్‌ దిగ్గజం భారత మార్కెట్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా భారీగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది.

2017 జూన్‌ క్వార్టర్‌లో అంతర్జాతీయ వ్యాపారాల్లో  అమెజాన్‌ నిర్వహణ నష్టాలు రూ.4,646 కోట్లకు పెరిగినట్టు కంపెనీ యాజమాన్యం తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో నిర్వహణ నష్టాలు రూ.866 కోట్లగా ఉన్నాయట. అయితే సంస్థ రెవెన్యూలు 25 శాతం, అమెజాన్‌ వెబ్‌ సర్వీసులు 27శాతం పైగా లాభాలు గడించినట్లు సమాచారం. నార్త్‌ అమెరికా వ్యాపారాల్లో కూడా ఆపరేటింగ్‌ ఇన్‌కమ్‌ 38 శాతానికి పడిపోయింది. కానీ ఎన్ని నష్టాలు ఉన్నప్పటికీ, అమెజాన్‌ భారత్‌లో పెట్టుబడులకు తాము కట్టుబడి ఉన్నామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ బ్రియాన్ టి ఒల్సావ్స్కీ వెల్లడించారు.