Home వార్తలు అంబానీలు, మిత్తల్స్ ఆమె క్లయింట్స్

అంబానీలు, మిత్తల్స్ ఆమె క్లయింట్స్

sare
125 విధాలుగా చీరలు కట్టి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌కి ఎక్కిన శారీ స్టైలిస్ట్ ఆమె…
స్టయిల్ గానే కాదు…చాలా వేగంగా చీర కట్టడంలో కూడా ఆమె దిట్ట. 18.5 సెకన్ల్లలో చీర కట్టడంలో గుర్తింపు పొందారు.
మోడల్స్, కళాకారులు,సినిమా తారలు,పెళ్లికూతుళ్లకు చీరలు కట్టడం ఆమె స్పెషాలిటీ.
ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్స్ ప్రసాద్ బిడప్పాలాటి వాళ్లతో పనిచేసి ఎన్నో ఫ్యాషన్‌షోలు నడపడం ఆమె విజయ పరంపరలోభాగం.
అంబానీ,మిత్తల్స్,గోయల్స్,గోయంకర్స్,జిందాల్స్ వంటి వాళ్లు ఆమె క్లైంట్స్.
ఆమె సొంతంగా వెడ్డింగ్ ప్లానింగ్, ఈవెంట్
మేనేజ్‌మెంట్ కంపెనీ నడుపుతారు. ఆమె డాలీ జైన్…

పార్టీ,పెళ్లి,ఫంక్షన్, ఇలా ఏ సందర్భమైనా భారతీయ మహిళ ముస్తాబు మొదలవుతుంది. అందులోనూ చీర ఏం కట్టుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. అందమైన చీరే కాదండోయ్! చీర కట్టు కూడా చాలా అందంగా ఉండాలి. ఈ ప్రయత్నంలోనే గంటల తరబడి చీర కట్టుకు కేటాయిస్తారు. కాని స్టైల్‌గా చీర కట్టే స్పెషలిస్ట్‌లు కూడా ఉంటారని మీకు తెలుసా! అలాంటివారిలో ఒకరు డాలీ జైన్. ఆమె తనలో ఉన్న ఈ కళను తన 37 ఏళ్ల వయసులో గుర్తించారు. ఆరుగజాల చీరతో అద్భుతాలు సృషించాలనుకు న్నారు. ఇంకేముంది చీకట్టడం వృత్తిగా ఎంచుకున్నారు.ఆమె చీర కట్టులో నైపుణ్యం ఆమె క్లైంట్స్‌ని ఆకట్టుకుంది. ‘ ప్రతి క్లైంట్‌కు ప్రత్యేక అవసరాలుంటాయి. వారి అభిరుచి,ఇష్టం,స్టైల్ కి తగ్గట్టు చీర కట్టాల్సి ఉంటుంది. ప్రతివారూ సౌకర్యంగా తమను తాము ప్రత్యేకం అని గర్వంగా చూపుకోటలిగేలా వారికి చీర కడతాను.’ అంటారు డాలీ. ఆమె చీర కట్టుకు ప్రతి క్లైంట్ దగ్గర తక్కువలో తక్కువ 5000 రూపాయలు తీసుకుంటారు.
నలుగురు విద్యార్థినులతో… డాలీ 2001 లో కేవలం తన నలుగురు విద్యార్థినులతో తన కెరీర్‌ను మొదలు పెట్టారు. ఆమె ఏడాదికి వెయ్యిమందికి పైగా చీరలు కడతారు. విదేశాల్లో కూడా ఆమె క్లైంట్స్ ఉన్నారు. ‘ నా వ్యాపారం ఇంత పెరగడా నికి కారణం ఇప్పుడు వస్తున్న డిజైనర్లే కారణం. సంప్రదాయ బనారసీ, కాంచీవరం పట్టులతో సహా ఎన్నో రకాల ఫ్యాబ్రిక్స్‌తో వారి సృజనకు పదును పెడుతున్నారు. ట్రెండీ బార్డర్స్, రెండు పల్లూలతో కలిసిన ఎం బ్రాయిడరీ చీరలు తయారు చేస్తున్నారు. అటువంటి డిజైనర్ కలెక్షన్ కట్టుకోవ డానికి యువతులు ఉత్సాహం చూపుతున్నారు. వెరైటీ చీరలను వెరైటీగా కట్టుకోవాలని కూడా ఆశిస్తారు. అందుకే చీర కట్టే వృ త్తి ఎప్పటికప్పుడు బావుంటుంది.’ అని చెప్తున్నారు ఆమె. దేశవి దేశాల్లో చీర కట్టు శిక్షణలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుం టారు.
ఎన్నో రకాల చీరకట్లు… గుజరాతీ,హైదరాబాదీ, భోపాలీ, రాజస్తానీ,లెహంగా,బెంగాలీ,అసామీస్, తొమ్మిది గజాల చీర ఇలా చాలా రకాల చీరకట్లు నేర్పుతారు. ఆమె దగ్గర చీరకట్టు నేర్చుకోవడానికి ఎక్కువశాతం 25 నుంచి 35 ఏళ్ల యువతులు వస్తుంటారు. చీరకట్టుల్లో హిప్-హాప్,టైట్‌ఫిట్,ఫిష్‌స్టైల్, హాఫ్ ముంతాజ్ ఇలా తనదంటూ కొన్ని ప్రత్యేకమైన చీరకట్టు కనిపెట్టారామె. కత్రినా కైఫ్,రవీనా టాండన్, యుక్తా ముఖీ, దివ్యామిర్జా,తను శ్రీ దత్తా,కంగనా రనౌత్,లారా దత్తా ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేని జాబితా వస్తుంది. ఏ పని లో అయినా పూర్తిగా మునిగిపోయి వందకి రెండొందల శాతం తపన పడితేనే విజయం వెన్నంటి వచ్చేది. అది డాలీ విష యంలో పూర్తి నిజమని అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త రకం చీర స్టైల్స్ కనిపెట్టడం అంటే మాటలా. రా త్రి అందరూ ని ద్రపోయే సమయంలో ఆమె మేల్కుంటారు. రకరకాలుగా చీరలు కట్టుకోవడం మొదలు పెడతారు. మొత్తం మీద తన ప్రయత్నం ఏదయినా సఫలీకృతం అయిందనిపిస్తే దాని ఫొటోలు తీసి పెట్టుకుంటారు. అయినా చీర కట్టే వృత్తి కొంచెం విభిన్నంగా,అసాధారణంగా అనిపించలేదు. ఎందుకు ఈ వృత్తి ఎంచుకున్నారు అంటే, ‘ నాకు పెళ్లయినప్పుడు మా అత్తగారిం ట్లో చీర మా త్రమే కట్టుకోవడానికి అనుమతి లభించేది. దానికి నేను ఆనందంగా ఒప్పుకున్నాను. చీర మా త్రమే కట్టుకోవాలని నిబంధన పెడితే నేను ఎలా కావాలంటే దాన్ని అలా కట్టుకుం టాను. దానికి ఒప్పుకోవాలని వారితో అన్నాను. నేను ఎప్పుడూ కాటన్ మా త్రమే కట్టుకునేదాన్ని. ఎప్పుడూ జార్జెట్,క్రేప్, షిఫాన్,పట్టు ఏమీ కట్టుకునేదాన్ని కాదు.’ అని ఆమె ఆలోచనకు ఎలా రూపం వచ్చిందో చెప్తారామె. ఇప్పటికి ఒక దశాబ్దానికి పైగా చీరలు కట్టే వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు యువత అమ్మో చీరా! మాకొద్దు అంటున్నారు. ఆధునిక వ స్త్రధారణకు ఇచ్చినంత ప్రాముఖ్యత చీర కట్టుకోవడానికి ఇవ్వరు. అదేదో పెద్దవారు కట్టుకునేదని, ఆధునికతను ప్రతిబింబించదనీ అనుకుంటారు. అయినా చీర కట్టుకోవడం అంటే చాలా పెద్ద పని. నాకసలు చేతకాదను కునేవారికి కొదవలేదు. అంతెందుకు ఎప్పటి నుంచో చీర కట్టుకుంటున్నవారు కూడా చీర కట్టుకు చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. చీరకట్టులో అందం కొంత శరీరాకృతి మీద ఆధారపడి ఉంటే చాలా భాగం కట్టుకునే తీరు మీదనే ఆధారపడి ఉంటుం ది. అందు కే చీర కట్టుకోవ డం పెద్ద సవాలు కాదు అని యువతులకు చెప్పడం తన ఉద్దేశ్యం అంటారు డాలీ. చీరను కళాత్మకంగా ఎలా కట్టుకోవాలో నేర్పడం, ప్రోత్సహిం చడం తన లక్షం అంటారు. యువతులకు నచ్చే ఆధునిక వ స్త్రధారణ తోనే చీరకట్టు మెళకువలు నేర్పుతున్నారు. కేవలం పెట్టీకోట్ మీద మా త్రమే చీర కట్టుకోవక్కరలేదు. జీన్స్ మీద, లెగ్గింగ్స్ మీద, లాంగ్ స్కర్ట్ మీద కూడా చీర కట్టుకోవచ్చని అంటారు డాలీ జైన్. చీర కట్టుకోవడం అంటే చాలా విసుగైన పని అనుకునే అమ్మా యిలకు నచ్చే విధంగా చీర కట్టు నేర్పుతా అంటున్నా రామె. ఎందుకు అమ్మాయిలు చీర కట్టుకోవా లంటే వెనకాడతారు. ఝాన్సీలక్ష్మీబాయి చీర కట్టుకుని యుద్ధం చేయగా లేనిది మీరు చీర కట్టుకోవ డానికేంటి కష్టం అంటారు. ఇంకెందు కు ఆలస్యం? కళాత్మకంగా చీర కట్టు నేర్చుకోండి. వీలైతే డాలీ జైన్ లాటి వాళ్లు నిర్వహించే వర్క్‌షాప్‌లో చీరకట్టు మెళకు వలు నేర్చుకుని మెరిసిపోండి. చీరకట్టులో మెరిసిపోవా లనుకున్న వారు, నేర్చుకోవాల నుకుం టున్న వారు సంప్రదించాల్సిన నంబర్లు…
డాలీ జైన్…సెల్ నెంబర్…9831812133
ఇ-మెయిల్ ఐడి…dollyjain.india@gmail.com