Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అంబరాన్నంటిన నూతన సంవత్సర సంబురాలు

NEW-YEAR-1

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి  : సంగారెడ్డి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్‌కు జెసి వాసం వెంకటేశ్వర్లుతో పాటు రెవెన్యూ అసోసి యేషన్ సంఘం నాయకులు శివకుమార్,మనోహర్ చక్రవర్తి తదితరులు పుష్ప గుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలియజేశారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉదయాన్నే కొత్త బట్టలుధరించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలోని న్యాల్‌కల్ మండలం రేజింతల్ వినాయక ఆలయంలో భక్తులు పోటెత్తారు. సంగారెడ్డిలోని బిసి సంక్షేమ హాస్టల్‌లో జిల్లా బిసి సంక్షేమాధికారి ఆశన్న విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.

Comments

comments