Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అర్హత ప్రవేశ పరీక్ష

Ambetker

హైదరాబాద్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 8వ తేది నుంచి డిగ్రీ విద్యార్హత కోసం ప్రవేశ పరీక్ష జరుగునుంది. ఈ విషయాన్ని అకాడమిక్ కౌన్సిలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దునుకు వేలాద్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. జూలై 1 నాటికి 18 ఏండ్లు నిండిన అభ్యర్థులకు విద్యార్హత లేకపోయినా ఓపెన్ డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలు తెలుగు రాష్ర్టాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో  ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి  కలిగిన వారు వైబ్‌సైట్‌లో లేదా ఈ నంబర్ కి 9985242391 కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకొవచ్చు.

Comments

comments