Home తాజా వార్తలు రాజ్యాంగ్య కర్త విగ్రహం ధ్వంసం

రాజ్యాంగ్య కర్త విగ్రహం ధ్వంసం

  • అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి
  • ప్రభుత్వ ఖర్చులతో నూతన విగ్రహన్ని ఏర్పాటు చేస్తామని హామి

Ambedkarమహబూబ్‌నగర్/కొల్లాపూర్ : మండల పరిధిలోని ఎన్మన్‌బెట్ల గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఎన్మన్‌బెట్ల గ్రామానికి వెళ్ళి ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సంఘటను పూర్తిగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు దురదృష్ణకరమని అన్నారు. సంఘటకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను అదేశించారు. ఈ అంబేద్కర్ విగ్రహన్ని ప్రభుత్వ ఖర్చులతో పునర్ నిర్మించేందకు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చిన్న నిరంజన్‌రావు, జడ్‌పిటిసి హన్మంత్ నాయక్ రామపూరం సర్పంచ్ బాల్‌రాజు, రహీమ్, మాజీ సర్పంచ్ రంగస్వామి, మాజీ ఎంపిటిసి నాగరాజు, సూర్య నాయక్, సిఐ రాఘవరావు, యస్‌ఐ మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.