Home జిల్లాలు అమీన్‌పూర్ చెరువును కలుషితం చేయొద్దు

అమీన్‌పూర్ చెరువును కలుషితం చేయొద్దు

కలుషిత జలాలు విడుదల చేస్తే చర్యలు తప్పవు
ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి

Untitled-1పటాన్‌చెరు : అమీన్‌పూర్ పెద్ద చెరువులో కలుషిత జలాలు విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పరిశ్రమలను హెచ్చరించారు. ఆదివారం ఉదయం ఇరి గేషన్, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి చెరువు పరిసరా లను పరిశీలించారు. కాలుష్య జలాలను విడుదల చేస్తున్న కోకకోలా, అరబిందో, ఎ సిఇ టైర్స్ పరిశ్రమల్లోకి వెళ్లి పరిశీలించారు. ఆయా పరిశ్రమలకు నోటీసులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల నుంచి కాలుష్య జలాలను విడుదల చేస్తున్నట్లు గు ర్తించామన్నారు. పరిశ్రమల మధ్యలో నుం చి చెరువు కట్టు కాలువ ఉండటంతో పరిశ్ర మల వారు నేరుగా కాలుష్య జలాలను వర్షపు నీటితో పాటు విడుదల చేస్తున్నారని తెలిపారు. దాంతో చెరువులో నీరు కలుషి తమై ఎన్నో జీవజాతులకు, ప్రజలకు ఇ బ్బందులు కలుగుతున్నాయన్నారు. అమీన్ పూర్ పెద్దచెరు వుకు ప్రపంచం నలు మూ లల నుంచి సుమారు 270రకాల పక్షులు వలస వస్తుంటాయని గుర్తు చేశారు. చెరువు లో తొమ్మిది రకాల చేపలు ఉన్నాయన్నారు.

నీటి కాలుష్యం కారణంగా ఈ జీవులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నా రు. అందుకోసం చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చెరువు ను అభివృద్ధి చేసేందుకు స్పెషల్ పోలీసు లు, తాను సంయుక్తంగా దానిని దత్తత తీ సుకున్నామని గుర్తు చేశారు. చెరువులో కా లుష్య జలాలు కలువకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అందుకోసం రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు రూ. నాలుగు కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. కాలుష్య జలాలను విడుదల చేసే పరిశ్రమలపై చ ర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ అధికారులకు సూ చించామన్నారు. ఆయా పరిశ్రమలు తిరిగి కొత్తగా అనుమతులు పొందాలని అన్నారు. తీసుకున్న అనుమతు లకు అనుగుణంగానే ఉత్పత్తులు చేయాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్య మంత్రికి నివేదిక అందిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడు తూ నియోజకవర్గంలో అతిపెద్దదైన అమీన్‌పూర్ చెరువును అభివృద్ధి చేసి పర్యాటక ప్రాం తంగా తీర్చిదిద్దుతామన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పరిశ్రమలు కాలుష్యం జీరో డిచార్జీతో పని చేయాలన్నారు. పటాన్‌చెరు నియోజకవ ర్గంలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. కాలు ష్య నియంత్రణ బోర్డు కార్యదర్శి అనిల్‌కు మార్ మాట్లాడుతూ చెరువులోకి వస్తున్న నీటి నమూనాలు సేకరిస్తున్నా మని తెలిపా రు. అనుమతులకు మించి ఉన్న అన్ని పరిశ్రమలకు నోటీసులు జారీ చేసి చర్య లు తీసుకుంటామని తెలిపారు.

ఈ పర్యటనలో ఇరిగేషన్ ఎస్‌ఈ సురేంద్రబాబు, ఇన్‌చార్జి ఎంపిడిఒ దిలీప్‌కుమార్, డిప్యూటీ తహసీ ల్దార్ శ్రీశైలం, ఎంపిపి శ్రీశైలంయాదవ్, సర్పంచ్ కాట శ్రీనివాస్‌గౌడ్, ఎంపిటిసి సభ్యులు బాల్‌రెడ్డి, కొల్లూరి మల్లేశం, అనిల్‌కుమార్, బా ల్‌రాజ్, వార్డు సభ్యులు భాస్కర్‌రెడ్డి, సుధాకర్, నాయకులు పాండురంగారెడ్డి, తులసీరెడ్డి, కాలప్ప, కొండ లక్ష్మణ్, శ్రీరాములు, నర్సింహ్మగౌడ్, లింగంగౌడ్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.