Home రాష్ట్ర వార్తలు రాజ్యాంగ సవరణ తెస్తాం

రాజ్యాంగ సవరణ తెస్తాం

భారీ ధర్మ యుద్ధ దండోరా సభలో వెంకయ్య నాయుడు హామీ

utttamహైదరాబాద్: ఎస్‌సి వర్గీకరణ కు సంబంధించిన రాజ్యాంగ సవరణను  ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేస్తామని, త్వర లోనే దీనిని చేపడతామని  కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడు హమీనిచ్చారు. ఎస్‌సిల వర్గీకరణ అంశంలో ప్రధా ని నరేంద్రమోడీ కూడా సానుకూలంగానే ఉన్నా రన్నారు. రిజర్వేషన్లు అమలులోకి వచ్చినా వాటి ఫలాలు అందరికీ అందలేదని, దీని ఫలితాలు చివరి వరుసలో ఉన్నవారికి అందాలనే ఉద్దేశంతో నే తాను ఎంఆర్‌పిఎస్ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నానని చెప్పారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పరెడ్ గ్రౌండ్స్‌లో ‘ధర్మ యుద్ధం’ పేరుతో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగించారు. న్యాయపరంగా, రాజకీయంగా ఉన్న అవరోధ నాలను అధిగమించి రాజ్యాంగ సవరణకు ప్రయ త్నాలు మొదలయ్యాయన్నారు. బహిరంగ సభకు టిఆర్‌ఎస్ రాకపోవడం వల్ల నష్టంలేదని, ఇది వరకే ఆ పార్టీ మద్దతు పలికిందని, పైగా అసెంబ్లీ లో తీర్మానం కూడా చేశారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గుర్తుచేశారు.దీన్‌దయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతం, ప్రాతిపదిక కూడా చివరి వరుసలో ఉన్న వారికి ఫలాలు అందాలని, అందులో భాగమే ఎస్‌సి రిజర్వేషన్లని ఆయన తెలిపారు. కులాల మధ్య దూరం పెంచడం తమ ఉద్దేశం కాదని, కులాల మధ్య సామరస్యం పెంచడమే కోసం ప్రయత్నిస్తున్నా మన్నారు. రిజర్వేషన్లకుమద్దతు ఇవ్వడం వల్ల కొందరి కి తనపై ఆగ్రహం ఉన్నదని, అయినా తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన ఫలాలు అందాలనేదే అంబేద్కర్ ఆశయమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ తరువాత అంత క్రమశిక్షణ ఎంఆర్‌పిఎస్ సభలో చూస్తున్నాని తెలిపారు. తనకు 23 ఏళ్ళ క్రితం మంద కృష్ణను కిషన్‌రెడ్డి పరిచయం చేశాడని అప్పటి నుండి సాన్నిహిత్యం పెరిగిందని గుర్తు చేశారు. ఒక రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి ఒక సంస్థను ఆదర్శప్రా యమైన సాంఘిక సంస్కరణ కోసం నాందీ పలికి, విప్లవోద్యమంగా మందకృష్ణ తీర్చిదిద్దారని కొనియా డారు. మాదిగలకు న్యాయం, సమన్యాయం కోసమే తాను వర్గీకరణకు మద్దతు పలికినట్లు తెలిపారు.
తనకు 65 ఏళ్లని, ఇప్పడు రాజకీయ చరమాంఖం లో ఉన్నానని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఏ పదవిని కూడా ఆశించనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అందరికీ ఫలాలు అందాలనే ఉద్దేశం తోనే వర్గీకరణకు మద్దతు పలుకుతున్నానని, తనకు ఎలాంటి రాజకీయ దురుద్ధేశంలేదన్నారు. నరేంద్ర మోడీ వచ్చాకే ప్రజలలో ఆకాంక్షలు పెరిగాయన్నారు. అన్నీ ఒకేసారి చేసేందుకు మోడీ వద్ద అలీవుద్దీన్ అద్భు తదీపం లేదని చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో పెద్దవారికే నిద్రపట్టడంలేదని, మధ్యతరగతి, పేద వారు ప్రశాం తంగాన నిద్రపోతున్నారని వివరించారు.
సభకు అధ్యక్షత వహించిన ఎంఆర్‌పిఎస్ వ్యవ స్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్‌సి వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వా లు ఏర్పాటు చేసిన మూడు కమిటీలు కూడా మద్దతు పలికినా ఇప్పటి వరకు వర్గీకరణ అమలు కాలేదన్నా రు. అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టా లని కోరారు. తాను కేంద్ర మంత్రి వెంకయ్యకు పాదాభివందనం చేయడం పట్ల తనపై సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు చేశారన్నారు. వర్గీకరణ విషయంలో తనను 22 ఏండ్లుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడే అండగా ఉండి నడిపించారని, దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలతో వర్గీకరణకు మద్దతుగా లేఖలను ఇప్పించడంలో ముఖ్యపాత్ర పోషించారని, అలాంటి వ్యక్తికి కృతజ్ఞత భావంతో తాను పాదాభివనందనం చేశానని వివరించారు. తన పోరాటంలో తనకు అనేక అడ్డంకులు, ఆటంకాల సృష్టించారని, వెన్నుపోట్లను పోడిచారని ఆయన ఆవే దన వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్నవాళ్లే తనను అడ్డంకులు సృష్టించినా తాను పోరాటాన్ని మాత్రం వెనక్కి తీసుకెళ్లలేదన్నారు. గుజ్జర్లు, తుని, హర్యానాలో అన్ని ఉన్నవాళ్లు సైతం తమకు అన్యాయం జరిగిందం టూ విధ్వంసం సృష్టించారని, వీరంతా ఉన్నత వర్గాలేనని, కాగా ఎస్‌సిలు మాత్రం వర్గీకరణ కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని గుర్తుచేశా రు. ఈసభకు సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించేందుకు అనేక సార్లు ప్రయత్నించానని, ఆఖరికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలను కూడా కలిసి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని, ఆఖరికి ఈ సభకు మాదిగ కులాలకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తనకు తెలిసినట్లు ఆయన తెలిపారు.
మాలలు సహకరించాలి : సురవరం
రాజ్యాంగ సవరణ ద్వారా వర్గీకరణకు పార్లమెంటు లోపల జరిగే ప్రయత్నాలతో పాటు పార్లమెంటు బయట వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. దళితుల్లో కొందరిలో ఉన్న అసంతృప్తి పోవాలని ఆయన అన్నారు. వర్గీకరణకు మాలలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దళుతులు, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని ఆయన ఆకాంక్షిం చారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బలపరిచిన, ఉషామెహ్రా కమిషన్ అనుకూలంగా సిఫారసు చేసినా అనేక ఒత్తిడుల కారణంగా వర్గీకరణ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దొండోరాను చీల్చడానికి ప్రయత్నించవద్దని ఆయన అన్నారు.
కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు : ఉత్తమ్‌కుమార్
అఖిల బారత కాంగ్రెస్ కమిటీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతుగా నిలబడుతుందని టిపిసిసి అధ్యక్షులు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉప కులాలకు చెందాలని ఎఐసిసి భావిస్తున్నదని అన్నారు. పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని ఉత్తమ్ వెల్లడించారు. మాదిగల పోరాటంతో ఏర్పడ్డ తెలంగాణలో సామాజిక న్యాయం, వర్గీకరణ జరగకపోవడం, తెలంగాణ మంత్రిమండలిలో మాల, మాదిగలకు ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ప్రధానమంత్రితో మాట్లాడుతా : దత్తాత్రేయ
వర్గీకరణపై తాను ప్రధానితో మాట్లాడి, తొందరగా పార్లమెంటులో బిల్లు పెట్టించేందుకు ప్రయత్నిస్తానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వర్గీకరణ పోరాటంలో సమాజహితం ఉందని ఆయన అన్నారు. వర్గీకరణ ఉద్యమం ఆగలేదని, ఇంకా బ్రతికే ఉందని ఆయన అన్నారు. మాల, మాదిగలు కలిసి ఉండాల్సిందేనని, వర్గీకరణ పేదల సమస్య అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ముందుకొస్తే : డాక్టర్ లక్ష్మణ్
కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సహకారంతో వర్గీకరణ బిల్లును తీసుకొస్తా మని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలి పారు. మోదికి అత్యంత సన్నిహితుడు వెంకయ్యనా యుడు మాదిగల న్యాయమైన డిమాండ్ వర్గీకరణకు న్యాయం చేస్తారని సంపూర్ణ విశ్వాసం ఉందని ఆయన అన్నారు.
సిపిఎం మద్దతు : జి.నాగయ్య
పార్లమెంటులో ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టినా సిపిఎం పార్టీ మద్దతు ఉంటుందని సిపిఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా ఎవరూ అధికారంలోకి వచ్చినా వర్గీకరణ బిల్లును వాయిదా వేస్తూ వస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణ టిడిపి మద్దతు : ఎల్.రమణ
తెలంగాణ టిడిపి వర్గీకరణకు మద్దతు ఇస్తుందని తెలం గాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ తెలిపారు.ఎన్నికల్లో వర్గీకరణ హామి ఇచ్చిన ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు వర్గీకరణ కోసం చొరవ చూపాలని దళితున్ని ముఖ్యమంత్రి చేయకపోవడం, వర్గీకరణ కోసం ముందుకు రాకపోవడం కేవలం బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు.
ఉద్యమ ఫలితాలు రానున్నాయి : రేవంత్‌రెడ్డి
మందకృష్ణ మాదిగ వర్గీకరణ ఉద్యమ ఫలితాలు రాబోతున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. వెంకయ్యనాయుడు సహకారంతో వారి కల నెరవేరబోతుందని అన్నారు. మాదిగల మధ్య చీలిక తేవడానికి చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
అంబేద్కర్ స్ఫూర్తితో : జి.కిషన్‌రెడ్డి
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్ఫూర్తితో వర్గీకరణ సాధ్యం అవుతుందని బిజెపి శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడిన బిజెపి వర్గీకరణ ఇస్తుందని ఆయన తెలిపారు.
ఎన్‌డిఎ చొరవ తీసుకోవాలి : కె.జానారెడ్డి
తెలంగాణ కోసం అన్ని పార్టీలను కాంగ్రెస్ కలుపుకు న్న తరహాలోనే వర్గీకరణ కోసం ఎన్‌డిఎ అన్ని పార్టీలను కలుపుకోవాలని సిఎల్‌పి నాయకులు కె.జానారెడ్డి కోరారు. వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని ఆయన అన్నారు.
వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవాలి : కర్నాటక మంత్రి హెచ్.ఆంజనేయ
వర్గీకరణ కోసం వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవా లని కర్ణాటక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ కోరారు. మాదిగలు వెంకయ్యనా యుడును విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు.
మీరాకుమార్ సందేశం
కార్యక్రమానికి ముఖ్య అతిథిల్లో ఒకరిగా రావాల్సిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పంపించిన సందేశాన్ని కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి చదివి వినిపించారు. మాదిగల న్యాయమైన వాటా వారికి దక్కాలని ఆమె ఆకాంక్షించారు. ఎఐసిసి నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె అన్నారు.