Home అంతర్జాతీయ వార్తలు జపాన్ చక్రవర్తితో ట్రంప్ భేటీ

జపాన్ చక్రవర్తితో ట్రంప్ భేటీ

Donald Trumpటోక్యో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ కొత్త చక్రవర్తి నరూహిటోతో ట్రంప్ భేటీ అయ్యారు. కొత్తగా చక్రవర్తి అయిన నరూహిటోను కలిసిన అంతర్జాతీయ నేత ట్రంప్ కావడం గమనార్హం. తన భార్య మెలానియా ట్రంప్ తో కలిసి ఆయన ఇంపీరియల్ ప్యాలెస్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ దంపతులకు రెడ్ కార్పెట్ పై ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులు నరూహిటో దంపతులతో భేటీ అయి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకొని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలని వారు పేర్కొన్నారు.

Amercia President Donald Trump Meets Japan Emperor