Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అమెరికా, భారత్ సంబంధాల్లో గొప్ప పరివర్తన: అరుణ్

arunవాషింగ్టన్: అమెరికా, భారత్ సంబంధాల్లో గొప్ప పరివర్తనను రెండు దేశాలు చవిచూస్తున్నాయని అమెరికాలోని భారత రాయబారి అరుణ్ కె.సింగ్ తెలిపారు. ఆయన ‘అమెరికా-భారత్ సంబంధాల పరిణామక్రమం’ అనే అంశంపై 20వ వార్టన్-ఇండియా ఎకనామిక్ ఫోరంలో ఉపన్యసిస్తూ ఈ విషయం తెలిపారు. రెండు సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ మూడోసారి అమెరికా పర్యటించనున్న నేపథ్యంలో ఆయన చెప్పిన ఈ విషయం ప్రాధా న్యతను సంతరించుకుంది. మూడు దశాబ్దాల క్రితం అమెరికా, భారత్ సంబంధాలు ఇలా వృద్ధి చెందుతాయని ఎవరూ ఊహించైనా ఉండరని, కానీ నేడు అనూహ్యంగా రెండు దేశాల మధ్య గొప్ప సంబంధాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ సంబంధాలను అమెరికా అధ్యక్షుడు ఒబామా ‘21వ శతాబ్ది భాగస్వామ్యానికి నిర్వచనం’ అని కీర్తిస్తే, మోడీ ‘సహజ కూటమి’గా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ప్రాపంచిక ఏకీభావం నెల కొందని మోడీ అన్నారు. ప్రధాని మోడీ 2014లో ఎన్నికైన నాటి నుంచి ఇప్పటికే అమెరికాకు రెండుసార్లు పర్యటి ంచారు. వచ్చే వారం వాషింగ్టన్‌లో జరిగే అణు భద్రత సదస్సుకు కూడా వెళ్లనున్నారని అరుణ్ కె సింగ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు అణు భద్రత సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు రోజుల ఈ సదస్సుకు ప్రధాని మోడీ హాజరవుతున్నారని అరుణ్ కె సింగ్ తెలిపారు.

Comments

comments