Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

దూకుడు మానకపోతే ఉత్తర కొరియాని దెబ్బతీస్తాం

అమెరికా తీవ్ర హెచ్చరిక

                       North-Korea

వాషింగ్టన్: అమెరికా భూభాగంపైగాని, మిత్ర దేశంపైగాని శతృత్వంతో దూకుడుగా వ్యవహరిస్తే తరువాత చితించవలసి వస్తుందని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ యున్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ తీవ్రంగా హెచ్చరించారు. చాలాఏళ్లుగా కిమ్ బెదిరింపులు చేస్తున్నా , ఇప్పుడు ఇక సహించబోమని , ఇక మరొక్క బెదిరింపు చేసినా కిమ్ ప్రభుత్వాన్ని దెబ్బ తీస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఆయన కుటుంబం కూడా చాలా ఏళ్లుగా తమ దేశాన్ని బెదిరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉత్తర కొరియా ఇటీవల అమెరికాకు స్థావరాలున్న గువామ్ దీవిపై ఖండాంతర క్షిపణులతో దాడి జరుపుతామని హెచ్చరించడంతో ట్రంప్ అదేశాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఉత్తర కొరియాపై అమెరికా రూపొందించిన ఆంక్షల తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి గతవారం ఏకగ్రీవంగా ఆమోదించిన తరువాత కిమ్ ప్రభుత్వం ఆ హెచ్చరిక చేసింది.

ఉత్తర కొరియా ఒకవేళ తెలివితక్కువగా దూకుడు చర్యకు దిగితే   వినియోగానికి సైనిక పాటవాన్ని తయారులో ఉంచినట్లుకూడా ట్రంప్ తాజాగా ప్రకటించారు. యుద్ద వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పారు. జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ భేటీ అయ్యాక ఈ ప్రకటన చేశారు. ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ, విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్, జాతీయ భద్రతా సలహాదారు  మెక్ మాస్టర్‌తో ఆయన అంతకు ముందు సమావేశమయ్యారు.

పసిఫిక్ సముద్రంలో అమెరికా అధీనంలోని దీవి గువామ్‌పై ఖండాంతర  క్షిపణి దాడికి కిమ్ హెచ్చరించాక అక్కడ అమెరికా సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు.  గువామ్ గవర్నర్ ఎడ్డీ కాల్వోకు ట్రంప్ ఈ విషయంలో అభయమిచ్చారు. గువామ్ ప్రజల రక్షణ బాధ్యత తమ సైన్యానిదని ఆయన హామీనిచ్చారు. కొరియా ద్వీప కల్పాన్ని అణ్వస్త్ర రహితం చేయడం తమ ఉమ్మడి లక్షమని గువామ్ నేతలతో ఫోన్‌లో చర్చల్లో ట్రంప్ స్పష్టం చేశారు.   అమెరికాను ఉత్తర కొరియా బెదిరించిన నేపథ్యంలో పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను సన్నద్ధం చేయడం జపాన్ ప్రారంభించింది. జపాన్ గతంలో తమ భూభాగంపై ఉత్తర కొరియా రాకెట్ల ప్రయోగం జరిపినపుడు   క్షిపణి దాడి జరుపుతామని ఉత్తర కొరియాను హెచ్చరించింది.

Comments

comments