Home అంతర్జాతీయ వార్తలు మరో మెగా ఫైట్

మరో మెగా ఫైట్

Boxingలాస్‌వేగాస్ : అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మెవెదర్ మరో మెగా ఫైట్‌కు సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు తన 19 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌లో రింగ్‌లో ఒటమే ఎరుగని మెవెదర్(48-0) అమెరికాకే చెందిన ఆండ్రీ బెర్టెతో తలపడనున్నాడు. ఈ బౌట్‌తో తన ప్రోఫెనల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు మెవెదర్ ప్రకటించడంతో మ్యాచ్‌ను తిలకించడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. రెండు నెలల క్రితం ఫిలిఫ్ఫిన్స్ యోధుడు మనీ పకియావోతో జరిగిన బౌట్‌కు 13 వందల కోట్లు ఆర్జించిన మెవెదర్ ఈ మ్యాచ్‌లో 200 కోట్లు మాత్రమే దక్కించుకోనున్నాడు. ఈ మ్యాచ్‌లో మెవెదర్ విజయం సాధిస్తే మాజీ దిగ్గజ బాక్సర్ రాఖీ మెర్సియానో అజేయ రికార్డు 49-0ను సమం చేయనున్నాడు. మరోవైపు 30-3 కెరీర్ రికార్డు ఉన్న 31 ఏళ్ల బెర్టె తన చివరి మ్యాచ్‌లో జెసెస్టో లోఫెజ్‌ను ఓడించి డబ్లుఎ వెల్టర్ వెయిట్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5.30గంటలకు జరుగుతున్న ఈ మ్యాచ్ సోనీసిక్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది.