Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

తక్కువ ధర పలికిన విజయ్ మాల్యా విమానం

Vijaya-Malya

బెంగళూరు: విజయ్ మాల్యాకు చెందిన విమానం తక్కువ ధరకే అమ్ముడు పోయింది. ఇప్పటికే ఈ విమానాన్ని మూడు సార్లు వేలం వేసిన ఎవరూ కొనుగోలు చేయటానికి ముందుకు రాలేదు. నాలుగో వేలంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఈ విమానాన్ని 5.05 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కర్నాటక హైకోర్టుకు అటాచ్ ఐనా విటి విజెఎం ఎంఎస్‌ఎం 2650 అనే విమానాన్ని 1.9 డాలర్లతో వేలం మొదలు పెట్టారు. కానీ అమెరికాకు చెందిన ఓ కంపెనీ రూ.34.08 కోట్లతో విమానాన్ని దక్కించుకుంది. ఈ విమానం విలువ మార్కెట్లో 100 మిలియన్ డాలర్లు ఉంటుందని విమానయాన అధికారులు పేర్కొన్నారు. కానీ గత మూడు సంవత్సరాల నుంచి విమానాన్ని వాడకపోవడంతో తక్కువ ధరకే అమ్ముడుపోయిందని చెప్పారు. విమానశాఖ అధికారులు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంబంధించిన పన్నులు వసూలు చేసుకునేందుకు ఈ విమానాన్ని వేలంలో పెట్టారు. విజయ మాల్యా వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగొట్టి లండన్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

Comments

comments