Search
Sunday 23 September 2018
  • :
  • :

ట్రంప్‌కు చుక్కెదురు

donald_trump1లాస్‌ఎంజిల్స్ :  ఏఢు ముస్లిం దేశాల పౌరులు, శరణార్థుల ప్రవేశంపై నిషేదాన్ని ఇప్పటికే అమెరికాలోని పలు న్యాయస్థానాలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నిషేధాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అమెరికన్ ఫెడరల్ ఆప్పీల్ కోర్టు నిరాకరించింది. తొమ్మిదో సర్కూట్ కోర్టులో దీనిపై ట్రంప్ కార్యవర్గం అప్పీలు దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు విలియమ్ కాన్‌బే, మిచెల్లీలు స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ తమ రెండు పేరాల రూలింగ్‌లో మాత్రం దీనికి కారణాలు వెల్లడించలేదు.

Comments

comments