Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఫెడ్ దెబ్బతో మార్కెట్లు పతనం

American Federal Reserve raises interest rates

న్యూఢిల్లీ:  అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రెట్లను పెంచడం, కరెంట్ ఖాతా లోటు మూడింతలు పెరగడం వంటి అంశాలు దేశీయంగా మార్కెట్లపై ప్రభావం చూపాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు గురువారం బ్రేక్ పడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్లు కోల్పోయి 35,600 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 49 పాయింట్లు నష్టపోయి 10,808 పాయింట్ల వద్ద ముగిసింది. కీలకమైన నిఫ్టీ బ్యాంక్ 81 పాయిం ట్లు నష్టపోయి 26,562 పాయింట్ల వద్ద ముగిసింది. మే నెల టోకు ధరల ద్రవ్యోల్బణం 4.45 శాతానికి ఎగిసి 14 నెలల గరిష్ట స్థాయి చేరుకోవడం, కరెంట్ అకౌంట్ లోటు ఆందోళనకంగా మారడంతో వంటి అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి. ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో దేశీయంగా సెంటిమెంట్ బలహీనపడగా.. మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 14 పాయింట్లు కోల్పోయి 35743 వద్ద, నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 10,833 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  అంతర్జాతీయ, దేశీయ పరిణామాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 250 పాయింట్లు కోల్పోయి 35489 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే ఫార్మా రంగం లాభపడగా, మిగతా అన్ని రంగాలు నష్టాలతో ముగిశాయి. ఫార్మా షేర్లలో కొనగోళ్లు జోరందుకోవడంతో సూచీలు కొంత మేర నష్టాలను తగ్గించుకోగలిగాయి. ప్రధానంగా ఐఒసి, ఇండియన్‌బుల్ హౌసింగ్‌ఫైనాన్స్, టిసిఎస్, అదానీ పోర్ట్, టెక్ మహీంద్రా షేర్లు 2 శాతం నష్టపోయాయి. మరోవైపు యస్ బ్యాంక్, సిప్లా, హెచ్‌సిఎల్ టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, లుపిన్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

Comments

comments