Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

అమెరికా హీరో కల్పనా చావ్లా: ట్రంప్

tranp

వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా అమెరికన్ హీరో అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు.అంతరిక్ష కార్యక్రమాల్లో ఆమె చేసిన సేవలు మరువలేనివని, జీవితంలో ఒక్కరోజైనా ఆస్ట్రోనాట్ కావాలనే స్ఫూర్తిని అమెరికా అమ్మాయిల్లో రగిలించిన హీరో అని ట్రంప్ అన్నారు. మే నెలను అమెరికాలో ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ హెరిటేజ్‌గా పరిగణిస్తారు. అమెరికా కాంగ్రెస్ కూడా దీన్ని ఆనవాయితీ మార్చుకుంది. భారత సంతతికి చెందిన 40 సంవత్సరాల చావ్లా అంతరిక్షంలో పనిచేసిన మొదటి భారత ఆస్ట్రోనాట్. ఆమె మరో ఆరుగురు వ్యోమగాములతో కలిసి స్పేస్ షటిల్ కొలంబియా నౌకలో 2003లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో స్పేస్ షటిల్ నౌక భూకక్షలోని వాతావరణంలో ప్రవేశించగానే ఒక్కసారిగా పేలిపోయి మిగతా ఆరుగురు ఆస్ట్రోనాట్స్‌తో పాటు కల్పనా చావ్లా ప్రాణాలు కోల్పోయారు. స్పేస్ షటిల్ కార్యక్రమంలో ఆమె విస్త్రృతమైన సేవలందించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కార్గోలను, అస్ట్రోనాట్స్‌ని పంపడంలో ఆమె ఎనలేని కృషి చేశారు. ఆమె సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని మరణాంతరం అవార్డుగా కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ హానర్‌ని అమెరికన్ కాంగ్రెస్ ప్రకటించిందని ట్రంప్ చెప్పారు.

Comments

comments