Home తాజా వార్తలు సెక్స్ రాకెట్ తారలకు అమెరికా పోలీసు సమన్లు?

సెక్స్ రాకెట్ తారలకు అమెరికా పోలీసు సమన్లు?

త్వరలో నటీమణుల విచారణ

Sex-Racketహైదరాబాద్: చికాగో సెక్స్ రాకెట్ కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెంది న కొందరు నటీమణులు, యాంకర్లను అమెరికా పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలిసింది. సెక్స్ రాకెట్‌కు సూత్రధారులైన అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయుడు కిషన్, చంద్రకళ దంపతులను వారం క్రితమే అమెరికా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్ల పేర్లపై వీసాలపై నటీమణులు, యాంకర్లను అమెరికాకు రిప్పించి వ్యభిచారం నిర్వహించే క్రమంలో ప్రధాన నిందితులు కిషన్ జరిపిన ఫోన్ సంభాషణ ఆడియో ఆధారంగా వ్యభిచారం నిర్వహించిన నటీమణులు, యాంకర్లను కూడా త్వరలో అమెరికా పోలీసులు విచారించేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం.

ఈ కేసును అక్కడి పోలీసులు ఛాలేంజ్‌గా తీసుకున్నారు. వ్యభిచారం చేసేందుకు కిషన్ భారత్ నుంచి సుమారు 150 మంది మహిళలను ఎంపిక చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ తతంగమంతా రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. ఈ రెండేళ్లలో కిషన్ ఎవరెవరికి వీసాలపై అమెరికా రప్పించాడనే విషయంపై అక్కడి పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలంటే వీసాపై అమెరికాకు వచ్చిన మహిళలను నుంచి సాక్షాలను సేకరించాలనే ఆలోచనలో అమెరికా పోలీసులు ఉన్నారు. అయితే మహిళలను నిందితుల జాబితాలో చేరుస్తారా లేక బాధితుల జాబితాలో చేరుస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇందులో ఎవరైనా బాధితులు ముందుకొచ్చి కిషన్ తమతో బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపాడని వాంగ్మూలం ఇస్తే అతనిపై మరో కేసు కూడా నమోదయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు అమెరికా పోలీసులు. యాంకర్లు, నటీమణుల బలహీనతలను అడ్డు పెట్టుకుని వారితో బలవంతంగా ఈ రొంపిలో దించాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే నటీమణులు, యాంకర్ల వాంగ్మూలాలను రికార్డు చేయనున్నారు. ఇప్పటికే కిషన్‌పై చార్జీషీట్ దాఖలు చేసిన దాంట్లో ఆరుగురు నటీమణుల పేర్లు ఉన్నాయి. కేసు విచారణలో భాగంగా వీరిని విచారించాల్సిందేనని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. త్వరలో వీరికి అమెరికా పోలీసుల నుంచి నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంత వరకు ఈ కేసులో వ్యభిచారం నిర్వహించిన నటీమణులు, యాంకర్ల పేర్లు బయటికి రాలేదు. అమెరికా పోలీసులు కూడా చార్జీషీట్‌లో వారి పేర్లకు బదులుగా ఎబిసిడిలుగా నమోదు చేశారు. అమెరికా పోలీసుల విచారణకు ఎవరెవరు హజరయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు చిత్రపరిశ్రమలో మొదలైంది