Home అంతర్జాతీయ వార్తలు హెచ్-1బి సవరణకు ఆమోదం!

హెచ్-1బి సవరణకు ఆమోదం!

H1B-VISA-1

వాషింగ్టన్ : హెచ్-1బి వీసాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏ మాత్ర వెనక్కి తగ్గడం లేదు. వీసాల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకురావడానికి తీసుకొస్తున్న హెచ్-1బి సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సీనియర్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు డారెల్ ఇస్సా తెలిపారు. హెచ్-1బి వీసా హోల్డర్స్ కు కనీస వేతనం రెట్టింపు చేయాలని ప్రతిపాదిస్తూ సవరణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణ బిల్లుతో ప్రతిభావంతులైన వారు మాత్రమే అమెరికాలోకి రావడానికి వీలుంటుందని, వీసా విధానంలో దుర్విని యోగాన్ని అరికట్టవచ్చని డారెల్ పేర్కొన్నారు. ఒకవేళ ఈ బిల్లు కనుక చట్టంగా రూపం దాలిస్తే అమెరికాలో పనిచేసే భారత ఐటి కంపెనీల కు, ఇతర కన్సల్టెన్సీలకు భారీగా నష్టం సంభవించే అవకాశాలున్నాయి