Search
Tuesday 20 November 2018
  • :
  • :

విజేతలు నాదల్, హలెప్

American sportsman, defeated Slovene Stephens

రోజర్స్ కప్ టెన్నిస్

టొరంటో: ప్రతిష్టాత్మకమైన రోజర్స్ కప్ మాస్టర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి క్రీడాకారులు రఫెల్ నాదల్ (స్పెయిన్), సిమోనా హలెప్ (రుమేనియా)లు టైటిల్స్ గెలుచుకున్నారు. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ హలెప్ అమెరికా క్రీడాకారిణి, మూడో సీడ్ స్లొవానె స్టీఫెన్స్‌ను ఓడించింది. పురుషుల విభాగంలో నాదల్ గ్రీస్ సంచలనం స్టెఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. స్టెఫానోస్‌తో జరిగిన మ్యాచ్‌లో నాదల్ ప్రారంభం నుంచే చెలరేగి ఆడాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు. చూడచక్కని షాట్లతో అలరించిన నాదల్ ఏమాత్రం ప్రతిఘటన ఎదుర్కొకుండానే సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో నాదల్‌కు ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈసారి స్టెఫానోస్ తన మార్క్ ఆటతో చెలరేగి పోయాడు. ఇద్దరు పోటీ ఆడడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఒక దశలో స్టెఫానోస్ ఆధిక్యంలో కనిపించాడు. కానీ, ఒత్తిడిని సైతం తట్టుకుని ముందుకు సాగిన టాప్ సీడ్ నాదల్ మరోసారి పైచేయి సాధించాడు. టైబ్రేకర్ వరకు వెళ్లిన పోరులో సెట్‌ను గెలిచిన నాదల్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో రానున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యాడు.

స్టీఫెన్స్‌కు చెక్..
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ హలెప్ 76, 36, 64 తేడాతో స్టీఫెన్స్‌ను ఓడించింది. తొలి సెట్‌లో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు ప్తరి పాయింట్ కోసం నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. ఇద్దరు పట్టు వీడకుండా ముందుకు వెళ్లారు. దీంతో పోరు హోరాహోరీగా తయారైంది. ఇదే క్రమంలో సెట్ టైబ్రేకర్‌కు వెళ్లక తప్పలేదు. టైబ్రేకర్‌లో ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న హలెప్ సెట్‌ను సొంతం చేసుకుంది. కాగా రెండో సెట్‌లో హలెప్‌కు చుక్కెదురైంది. కానీ మూడో సెట్‌లో దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌ను గెలిచి రోజర్స్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Comments

comments