Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

రూ. 28.33 లక్షల కోట్లు ఆవిరి

bs

 500 మంది ప్రపంచ సంపన్నులు విలవిల
 ఏడవ స్థానానికి దిగజారిన జుకర్‌బర్గ్
 అమెరికా స్టాక్ సూచీలు భారీగా పతనం
 కుబేరులను దెబ్బతీసిన ప్రపంచ మార్కెట్ల సుంకాల పెంపు

వాషింగ్టన్: ప్రపంచ సంపన్నులకు 2018 అంతగా కలిసొచ్చినట్లు లేదు. వరుస పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు కుదేలవడంతో సంపన్నుల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. ఈ ఏడాది జనవరి 26 నుంచి ఇప్పటివరకు టాప్ 500 ప్రపంచ కుబేరులు 436 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 28.33లక్షల కోట్లకు పైమాటే. ఒక్క ఈ వారంలోనే ఆ 500మంది 181 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూశారు. ఇందులో ఎక్కువగా సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ నష్టపోయారు.
జనవరి 26 నుంచి జుకర్‌బర్గ్ 10.3 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. దీంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో జుకర్‌బర్గ్ 4వ స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయారు. కుంభకోణం వివాదం ఫేస్‌బుక్‌ను చుట్టుకోవడంతో అతడు ర్యాంకింగ్‌లో మూడు స్థానాలు కిందికి దిగజారాడు. 5 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జి అనలిటిక దుర్వినియోగం చేసిందన్న వార్తలు రావడంతో ఫేస్‌బుక్ సంస్థ షేర్లు 14 శాతం పతనమయ్యాయి.
ఇక ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ 7 బిలియన్ డాలర్లు నష్టపోయారు. బెర్క్‌షైర్ హాత్‌వే ఛైర్మన్ వారెన్ బఫేట్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆల్ఫాబెట్ సిఇఒ ల్యారీ పేజ్ సంయుక్తంగా 17 బిలియన్ డాలర్లు కోల్పోయారు. దీంతో బ్లూమ్‌బర్గ్ సూచీ ప్రకారం 500 ప్రపంచ కుబేరుల మొత్తం సంపద 5.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.ఫిబ్రవరిలో క్రెడిట్ రేటింగ్ పెంచడంతో అమెరికా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు ఎస్ అండ్ పి 500సూచీ, డో జోన్స్ ఇండిస్ట్రియల్ యావరేజ్ రెండేళ్లకైపైగా కాలంలో ఒకే వారంలో భారీగా పతనమయ్యాయి. ప్రపంచ మార్కెట్లో సుంకాల పెంపకం కారణంగా ఈ వారంలోనే 500 మంది ప్రపంచ సపన్నుల 181 వందల కోట్ల డాలర్లు ఆవిరయిపోయాయి.

Comments

comments