Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా బ్రెట్

ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

America-Judge

వాషింగ్టన్: అమెరికా అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా బ్రెట్ కవనాఫ్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు. సంప్రదాయవాదిగా పేరున్న బ్రెట్‌ని సుప్రీంకోర్టు జస్టిస్‌గా నియమించడంతో అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ ప్రతిపాదిత గర్భవిచ్ఛిత్తి, తుపాకుల నియంత్రణ, వలస వంటి అంశాలకు న్యాయం చేకూరుతుందని ఆయ న భావిస్తున్నారు. అంతేకాకుండా భావజాలపరంగా సు ప్రీంకోర్టులో నెలకొన్న విభేదాలు తొలగిపోతాయని ఆశిస్తున్నారు. ట్రంప్ ఎంపిక చేసిన  బ్రెట్‌కి రిపబ్లికన్లతో గట్టి సం బంధాలున్నాయి. 25మంది జాబితా నుంచి బ్రెట్‌ని ట్రంప్ ఎంపిక చేశారు. ముందుగా తయారు చేసిన జాబితాలో భారత్ సంతతికి చెందిన అమూల్ థాపర్ కూడా ఉన్నారు. ఆయనని ట్రంప్ ఇంటర్వూ కూడా చేశారు. అయితే చివరగా ముగ్గురి పేర్లతో తయారైన జాబితాలో అమూల్ పేరుని చేర్చలేదు. దీంతో ఆయన అమెరికా సుప్రీంకోర్టులో శాశ్వత జస్టిస్‌గా పని చేసే అవకాశాన్ని కోల్పోయారు. 81 ఏళ్ల జస్టిస్ ఆం టోని కెన్నడీ తాను పదవీ విరమణ చేస్తున్నానని ప్రకటించారు. ఆయన స్థానంలో బ్రెట్‌ని ట్రంప్ నియమించారు.  బ్రెట్ నియామకాన్ని రిపబ్లికన్లు బలపరుస్తుంటే, డెమొక్రాట్స్ ఆయన ఎంపికని వ్యతిరేకిస్తున్నారు. బ్రెట్ చాలా తెలివిగల వారని, ఆయనపై ఎటువంటి ఆరోపణలు లేవని, మచ్చలేని మనిషని రిపబ్లికన్లు అంటున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత రిపబ్లికన్లు సెనేట్ నిబంధనలని మార్చారు. సుప్రీంకోర్టు జస్టిస్‌ని నామినేట్ చేసే అధికారాన్ని  అధ్యక్షుడికి కట్టబెట్టారు. సెనేట్ నిబంధనలను మార్చిన తరువాత మొదట జస్టిస్ నీల్ గోర్‌సచ్‌ని అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా ట్రంప్ నియమించారు. తాజాగా జడ్జిగా  బ్రెట్‌ని  ట్రంప్ ఎంపిక చేశారు. అయితే ఈ నియామకాన్ని సెనేట్ ఆమోదించాలి.

Comments

comments