Home బిజినెస్ డేటా లోకలైజేషన్ బిల్లుపై అమెరికా టెక్‌ల పోరు

డేటా లోకలైజేషన్ బిల్లుపై అమెరికా టెక్‌ల పోరు

American Tech Fighting on Data Localization Bill

వినియోగదారుల డేటా పరిరక్షణకే ముసాయిదా బిల్లు
డేటా లోకలైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే 

న్యూఢిల్లీ:  భారతీయ డేటా లోకలైజేషన్ అగత్యముపై అమెరికా టెక్నాలజీ దిగజాలు పోరాడేందుకు లాబీయిం గ్ యత్నాలను తీవ్రతరం చేయచూస్తున్నాయని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. డేటాను స్థానికంగానే నిల్వచేయాలన్న భారత్ నియమాన్ని అమెరికా వాణిజ్య గ్రూపులైన అమెజాన్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మైక్రోసాఫ్ట్ వ్యతిరేకిస్తున్నాయి. వినియోగదారుల డేటాను కాపాడేందుకే భారత్ ఈ నియమాన్ని పెడుతోంది. కానీ దానివల్ల భారత్‌లో అమెరికా కంపెనీల పెట్టుబడులు దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాక దీనివల్ల ఇప్పటికే అమెరికాతో ఉన్న ఆర్థిక సంబంధాల్లో మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. ఇప్పటికే అమెరికా టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లు ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని తమ ఆందోళనల గురించి వివరించారని సమాచారం. న్యూఢిల్లీలో సెప్టెంబర్‌లో జరగనున్న భారత్‌అమెరికా చర్చల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని కూడా చెప్పినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు ఈ డేటా లోకలైజేషన్ ప్లాన్స్‌పై తుది నిర్ణయం తీసుకోలేదు. అమెరికా దిగుమతి సుంకాల పెంపుపై భారత్ ఇప్పటికే కాలుదువ్వుతోంది. వైద్య పరికరాల ధరలపై పరిమితి విధానం తేవాలని భారత్ యోచిస్తోంది. దీనివల్ల అమెరికా ఫార్మా కంపెనీలకు నష్టం కలుగనుంది.‘భారతఅమెరికా వాణిజ్య స్థాయి చర్చల్లో దీనిపై చర్చిస్తాం’ అని ఇంటర్నెట్ కంపెనీ మొజిల్లా కార్పొరేషన్‌లోని గ్లోబల్ పబ్లిక్ పాలసీ అడ్వయిజర్ అంబ కక్ చెప్పారు.‘డేటా లోకలైజేషన్ అనేది కేవలం వాణిజ్యపర ఆందోళన కాదు. దానివల్ల ప్రభుత్వ నిఘా బాగా సులభతరం అవుతందనేదే వేధిస్తోంది’ అన్నారు. షాపింగ్, సోషల్ నెట్‌వర్కింగ్‌లకు భారత్‌లో డిజిటలైజేషన్ వేదికలను ఎక్కువ ఉపయోగిస్తుండటంతో అమెరికా టెక్నాలజీ కంపెనీలకు మరింత ఆకర్షణీయంగా మారిం ది. అయితే డేటా ఉల్లంఘన ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ డేటా సంరక్షణ నియమాలను మరిం త బలోపేతం చేస్తోంది. ఇదిలా ఉండగా ‘డేటా లోకలైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నదే. దీనికి భారత్ అతీతం ఏమీ కాదు’ అని మోడీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు షమిక రవి అన్నారు. బ్రూకిం గ్స్ ఇండియాలో రిసెర్చ్ డైరెక్టర్ కూడా అయిన ఆయన ‘ఇది దీర్ఘకాలిక వ్యూహం. ఇందులో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నా యి’ అన్నారు. డేటా లోకలైజేషన్‌పై భారతీయ బిల్లు ను ఈ వారం ప్రజా అభిప్రాయానికి ఓపెన్‌గా పెట్టారు. ఇది తర్వాత పార్లమెంటు ఆమోదానికి వెళ్లనున్నది. దీని పై మాస్టర్‌కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్,అమెజాన్ ప్రతిస్పందించేందుకు నిరాకరించాయి.కాగా ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, వీసా, పేపాల్ వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి.