Home అంతర్జాతీయ వార్తలు సౌదీకి అమెరికా ఆయుధాలు

సౌదీకి అమెరికా ఆయుధాలు

OBAMAవాషింగ్టన్ : సౌదీ అరేబియాకు 1.15 బిలియన్ డాలర్ల విలువ చేసే యుద్ధట్యాంకులు, ఇతర ఆయుధాలు విక్రయించే ఒప్పందాన్ని అమెరికా సెనేట్ అంగీకరించింది. రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్, డెమోక్రటిక్ సెనేటర్ క్రిస్ మర్ఫీలు సహా కొందరు సెనేటర్లు ఈ డీల్‌ను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ, ఎక్కువ ఓట్లు ఆయుధాల విక్రయానికే పడడంతో ఒప్పందానికి ఆమోద ముద్ర పడింది. సౌదీ ఇస్లాం బ్రాండ్‌ను విస్తరిస్తోందంటూ ఈ డీల్‌ను వ్యతిరేకించిన సెనేటర్లు వాదించారు. సౌదీ అరేబియాకు 130 అబ్రామ్ యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధ సామగ్రి విక్రయానికి దేశ హోంశాఖ అంగీకరించిందని గతంలోనే అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ వెల్లడించింది. సౌదీతో ఆయుధాల విక్రయ ఒప్పందానికి జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్ ప్రిన్సిపల్ కాంట్రాక్టర్‌గా ఉంటుందని డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజెన్సీ వెల్లడించింది.