Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పంచ్ అదిరింది

Amit Panghal bags gold in men's boxing

ఆసియా క్రీడల్లో శనివారం 14వ రోజు భారత్ మరో రెండు స్వర్ణాలు సాధించింది. పురుషుల బాక్సింగ్‌లో అమిత్ పంగల్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. బ్రిడ్జ్ పోటీల్లో భారత జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. దీంతో ఈ క్రీడల్లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య 15కు చేరింది. ఇక, మహిళల స్కాష్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రజతంతోనే సంతృప్తి పడింది. హాకీలో భారత్ 21 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి కాంస్యం దక్కించుకుంది. శనివారం పోటీలు ముగిసే సమయానికి భారత్ పతకాల సంఖ్య 69కు చేరింది. ఇందులో 15 స్వర్ణాలు, 24 రజతాలు, మరో 30 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి. కాగా ఆసియా క్రీడలు ఆదివారం ముగియనున్నాయి. ముగింపు వేడుకల్లో భారత బృందానికి మహిళ హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ సారథ్యం వహిస్తోంది.

                                                                                                                                                                – జకార్తా

బాక్సింగ్‌లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ భారత యువ సంచలనం అమిత్ పంగల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 49 కిలోల లైట్ ఫ్లై విభాగంలో అమిత్ స్వర్ణం గెలుచుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అమిత్ 32 తేడాతో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన రియో ఒలింపిక్ చాంపియన్ దుస్మాతోవ్ హసన్‌బాయ్‌పై సంచలన విజయం సాధించాడు. ఈ క్రీడల్లో భారత్‌కు ఇదే ఏకైక స్వర్ణం. ప్రారంభం నుంచే ఫైనల్ సమరం ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు కళ్లు చెదిరే పంచ్‌లతో చెలరేగారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. అమిత్ తనకంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న దుస్మాతోవ్‌పై ఆధిపత్యం చెలాయించాడు. అద్భుత పంచ్‌లతో అతన్ని కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో అమిత్ ప్రారంభం నుంచే పదునైన పంచ్‌లతో అగ్రశ్రేణి బాక్సర్ దుస్మాతోవ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. చివరి వరకు అదే జోరును కొనసాగిస్తూ చారిత్రక విజయాన్ని అందుకున్నాడు. ఇదే క్రమంలో తన ఖాతాలో ప్రతిష్టాత్మకమైన స్వర్ణ పతకాన్ని జమచేసుకున్నాడు. ఇంతకుముందు వికాస్ కృష్ణన్ గాయం వల్ల సెమీస్ పోరు నుంచి తప్పుకున్నాడు. దీంతో అతనికి కాంస్యం మాత్రమే దక్కింది. కానీ, అమిత్ అసాధారణ ఆటతో వికాస్ లోటును పూడ్చడమే కాకుండా భారత్‌కు మరో స్వర్ణం సాధించి పెట్టాడు.

Comments

comments