Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రాజ్యసభకు ఎంపిల గైర్హాజరుపై అమిత్ షా ఆగ్రహం

AMIT-SHAH

ఢిల్లీ : రాజ్యసభలో సోమవారం బిజెపి ఎంపిల గైర్హాజరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో సోమవారం బిసిలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన నాలుగు సవరణలపై ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో రాజ్యసభలో బిజెపి ఎంపిల సంఖ్య తక్కువగా ఉండడంతో 74-52 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. అయితే బిజెపికి చెందిన సుమారు 20 మంది ఎంపిలు సోమవారం సభకు హాజరు కాలేదు. క్రమంలో మంగళవారం బిజెపి పార్లమెంటరీ సమావేశం జరిగింది. సోమవారం రాజ్యసభకు హాజరు కాని బిజెపి ఎంపిల తీరుపై అమిత్‌షా అసంతృప్తి వ్యక్తం చేశారు. విప్ జారీ చేసినా సభ్యులు సభకు హాజరుకాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటిది మరోసారి పునరావృతం కాకూడదని ఆయన ఎంపిలకు సూచించారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని ఓట్ల గురించి కూడా అమిత్ షా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సరిగా ఓటేయాలని ఆయన బిజెపి ఎంపిలకు సూచించారు.

Amit Shah Comments on Absconding BJP MPs

Comments

comments