Home జాతీయ వార్తలు ఇది పాకిస్థాన్‌పై మరో దాడి

ఇది పాకిస్థాన్‌పై మరో దాడి

Amit Shah

న్యూఢిల్లీ : ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించిన భారత క్రికెట్ జట్టును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. పొరుగుదేశంపై ఇది మరో దాడి. ఫలితం అదే…అని విజయంపై వ్యాఖ్యానించారు. ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లో పాక్ జట్టును ముప్పు తిప్పలుపెట్టి 89 పరుగుల ఆధిక్యంతో భారత క్రికెట్ జట్టు ఓడించిన తర్వాత అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తమ ప్రదర్శన అందించిన టీమిండియాను అభినందిస్తున్నాను. ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు’ అని వ్యాఖ్యానించారు. ఇది మరో దాడి అంటూ హోంమంత్రి ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన జరిపిన దాడిని ప్రస్తావించారు.

Amit Shah congratulates India on World Cup win