Search
Friday 16 November 2018
  • :
  • :

అందరి కంటే పెద్ద కసబ్ అమిత్ షా : మాయావతి

Mayawathi

అంబేడ్కర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగు తున్న నేపథ్యంలో నాయకుల మధ్య హోరాహోరీ మాటల యు ద్ధం కొనసాగుతోంది. పరస్పర విమర్శనాస్త్రాలు సంధించుం కుంటున్నారు. పార్టీల పేర్లకు నానార్థాలను వెతుకున్నారు. ఈ క్రమంలోనే బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం కాంగ్రెస్+ ఎస్‌పి+బిఎస్‌పి కలిస్తే కసబ్ అంటూ చేసిన వ్యాఖ్యలపై బిఎస్‌పి అధినేత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కంటే పెద్ద కసబ్ అమిత్‌షా అని విమర్శించారు. ఆయనకంటే అతిపెద్ద ఉగ్రవాది మరోకరు లేరని యావత్ దేశ ప్రజలకు తెలుసునన్నారు. కాగా, యుపిలో కొంత కాలంగా కసబ్ (కాం గ్రెస్+ఎస్‌పి+బిఎస్‌పి) పాలన కొనసాగు తోందని, దీంతో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తింగా కుంటుపడిం దని అమిత్ షా వ్యాఖ్యానించారు.

అదే విధంగా ప్రధాని మోడీ మొదటిసారిగా యుపిలో నిర్వహించిన మొదటి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ సమాజ్‌వాది, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను  ‘స్కామ్’ (ఎస్‌సిఎఎం)గా అభివర్ణించారు. బిఎస్‌పి అంటే ‘బెహన్‌జీ సంపత్తి పార్టీ’గా అని ఆయన పేర్కొన్నారు. అయితే మోడీ వ్యాఖ్యలను మాయవతి తిప్పికొట్టారు. బిజెపి అంటే ‘భారతీయ జుమ్లా పార్టీ’ అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ పేరును ‘మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్’గా అభివర్ణించారు. ఇదిలా ఉండగా, గురువారం నాటి పోలింగ్‌తో యుపిలో సగం ఎన్నికల ప్రక్రియ ముగిసింది.

Comments

comments