Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రేపు హైదరాబాదుకు రానున్న అమిత్ షా…

Amit shah launch election campaign in telangana

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మహబూబ్ నగర్ ఎంవిఎస్ కళాశాల ప్రాంగణంలో బిజెపి ఎన్నికల ప్రచారాన్నిషా ప్రారంభించబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి 12 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకుని మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు పాతబస్తీలో ఉన్న లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మహబూబ్ నగర్ లో నిర్వహించే బహిరంగసభకు బయల్దేరి వెళ్లనున్నారు. కొత్తూరులో సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఐలు అనైతికమైన పొత్తు పెట్టుకుంటున్నాయని తీవ్రంగా విమర్శించారు. జీవం లేని కాంగ్రెస్ ను టిడిపి, సిపిఐలు బతికించలేవని ఆయన చెప్పారు.

Comments

comments