Home జాతీయ వార్తలు ఎపి బిజెపి నేతలతో అమిత్‌షా భేటీ

ఎపి బిజెపి నేతలతో అమిత్‌షా భేటీ

Amit Shah to Meet Andhra BJP Leaders Today

ఢిల్లీ : ఎపి బిజెపి నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇటీవల ఎపిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. రాష్ట్ర విభజన హామీల అమలుపై ఎపి ప్రభుత్వం, ఎన్‌డిఎ ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్‌డిఎ నుంచి టిడిపి వైదొలిగింది. దీంతో ఎపిలో బిజెపికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అమిత్‌షా ఎపి బిజెపి నేతలతో భేటీ అయ్యారు. ఎపిలో బిజెపి బలోపేతం, కేంద్రంపై టిడిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో ఎపి బిజెపి నేతలతో పాటు ఎపి బిజెపి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ఎపిలో వైసిపికి వ్యూహకర్తగా ఉన్నారు. ఈ క్రమంలో బిజెపి కూడా ఆయన్నే వ్యూహకర్తగా నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, వైసిపి కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

Amit Shah Meeting with AP BJP Leaders