Home జాతీయ వార్తలు రాందేవ్‌తో అమిత్‌షా భేటీ

రాందేవ్‌తో అమిత్‌షా భేటీ

 Amit Shah meeting with Ramdev

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బిజెపి) అ ధ్యక్షుడు అమిత్‌షా తన పార్టీ ‘మద్దతు కోసం సంప్రదించడం’ అనే ప్రచారంలో భాగంగా యోగా గురువు రామ్‌దేవ్ బాబాను కలుసుకున్నారు. మోడీ ప్రభుత్వం సాధించిన విషయాలను ఆయనతో పంచుకున్నారు. ఈ విషయాన్ని అమిత్ షా తన ట్వీట్ ద్వారా తెలిపా రు. మోడీ ప్రభుత్వం నాలుగో వార్షికోత్సవాన్ని పురుస్కరించుకుని మే 26న బిజెపి ‘మద్దతు కో సం సంప్రదించడం’ అనే కార్యక్రమాన్ని ఆరంభించింది. ఈ ప్రచారంలో భాగంగా బిజెపికి చెందిన 4000 మంది కార్యకర్తలు తమతమ రంగాల్లో నిష్ణాతులైన దాదాపు లక్ష మంది ప్రజలను సంప్రదిస్తారు. అమిత్ షా స్వయంగా 50 మంది వ్యక్తులను ఈ ప్రచారంలో భాగంగా కలుసుకోనున్నారు. అమిత్‌షా ఇప్పటికే మే 29 న ఆర్మీ మాజీ చీఫ్ దల్బీర్ సింగ్, సుభాష్ కశ్యప్‌లను కలుసుకున్నారు. అంతేకాక ఆయన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌ను కూడా కలుసుకున్నారు.  మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పడం, ప్రజల జీవనప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయి, గ్రామాల్లో  చడానికి ఎలాంటి పనులు చేపట్టింది అనే విషయాలపై వారితో చర్చించారు.