Home జాతీయ వార్తలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే: అమిత్ షా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే: అమిత్ షా

 Amit Shah said Victory in Karnataka Assembly elections

బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమ దేనని  బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా  ధీమా వ్యక్తం చేశారు. బెంగుళూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అత్యంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఘాటుగా విమర్శలు చేశారు. కర్ణాటకలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. మహారాష్ర్టలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలు తగ్గిందని ఆయన తెలిపారు. కానీ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను నిలువరించడంలో విఫలమైందని, సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని  అమిత్ షా అన్నారు. కర్ణాటక అభివృద్ధి, రాజధాని బెంగుళూరుపై ఆధారపడి ఉందని, కానీ బెంగుళూరుకు సిద్ధరామయ్య సర్కార్‌ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.