Search
Friday 21 September 2018
  • :
  • :

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారకర్తగా అమితాబ్

          Amitabh-Bachchan

ముంబయి: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను   ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారకర్తగా నియమించింది. హెపటైటిస్ వ్యాధితో తాను చాలా ఇబ్బందిపడ్డానని, హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్నావారికి  అవగాహన కల్పిస్తానని బిగ్ బి తెలిపారు. ఈ వ్యాధికి ప్రచారకర్తగా ఉండటానికి ఇష్టపడుతున్నానని చెప్పారు.  ఈ వ్యాధి నివారణకు సంబందించిన  విషయాలను ప్రచార సాధనాల తెలియజేస్తానని చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా 325 మిలియన్ల మంది హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్నారని డబ్ల్యుహెచ్ఒ నివేదికలో వెల్లడించింది.

 అమితాబ్ 1982లో కూలీ చిత్రాన్ని షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు ఆయనకు రక్తాన్ని ఎక్కించినప్పుడు హెపటైటిస్ వ్యాధి సోకింది. 2000 వసంవత్సరంలో హెల్త్ చెకప్ చేయించకున్నప్పుడు అమితాబ్ కు హెపటైటిస్ వ్యాధి సోకినట్లు తెలిసింది.

Comments

comments