Home తాజా వార్తలు మేరీకోమ్‌కు శుభాకాంక్షల వెల్లువ

మేరీకోమ్‌కు శుభాకాంక్షల వెల్లువ

Amitabh Bachchan Congratulates to Mary Kom
హైదరాబాద్: భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ మహిళల ప్రపంచ బాక్సింగ్‌లో ఆరో స్వర్ణం సాధించి ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ప్రత్యర్థి ఉక్రెయిన్‌ క్రీడాకారిణి హనాపై భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ అలవోకగా విజయం సాధించింది. ఫైనల్ పోరులో 48 కేజీల విభాగంలో మేరీ కోమ్, ఒఖోటాను  5-0తో మట్టికరిపించి విజేత నిలిచింది.
దీంతో ప్రపంచ బాక్సింగ్‌లో అత్యధిక పతకాలు గెలిచిన మహిళా క్రీడాకారిణిగా మేరీకోమ్ రికార్డు సృష్టించారు. ఆరో స్వర్ణం సాధిం చిన మేరీకోమ్‌కు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అభినందనలు తెలిపారు. ఇక, సోషల్‌ మీడియా లో పలువురు సినీ ప్రముఖులు మేరీకోమ్‌ను దేశానికే గర్వకారణమని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.
అమితాబ్‌ బచ్చన్‌: మేరీకోమ్‌ మీరు ఈ దేశానికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆరు సార్లు స్వర్ణం గెలిచినందుకు శుభాకాంక్షలు. మీరు నాకు కానుకగా ఇచ్చిన బాక్సింగ్‌ గ్లౌజులను జాగ్రత్తగా ఉంచుకుంటాను. అవే నాకు బంగారు పతకాలు.
ఎస్‌.ఎస్‌.రాజమౌళి: ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆరోసారి స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించిన మేరీకోమ్‌కు శుభాకంక్షలు. ఈ దేశానికి మీరు గర్వకారణం. అదేవిధంగా మీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఇలానే విజయాలు సాధిస్తూ ఉండండి.
విక్టరీ వెంకటేశ్‌: మేరీకోమ్‌ విజయం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఆమె భారతీయులు గర్వపడేలా చేశారు. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచారు.
మహేశ్‌బాబు: అద్భుతమైన విజయం. మీ విజయం పట్ల చాలా గర్విస్తున్నాం ఛాంపియన్‌. ఆరో ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ను గెలుచుకున్నందుకు శుభాకాంక్షలు మేరీకోమ్. ఆకాశమేహద్దు.
ప్రియాంకా చోప్రా: అద్భుతం.. కేవలం మీరు మాత్రమే దీన్ని సాధించగలిగారు. ఎంత గొప్ప విజయం.. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో ఆరోసారి స్వర్ణం గెలిచిన‌ తొలి మహిళా బాక్సర్‌. శుభాకాంక్షలు మేరీకోమ్‌. ఇది దేశం గర్వించదగ్గ సమయం. మీరు ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిదాయకం.
Amitabh Bachchan Congratulates to Mary Kom