Home తాజా వార్తలు అమితాబ్ కుటుంబంలో విషాదం…

అమితాబ్ కుటుంబంలో విషాదం…

Amitabh daughter Shweta Nanda’s father-in-law Rajan Nanda Passed away
ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో విషాదం నెలకొంది. అమితాబ్ వియ్యంకుడు ఎస్కార్ట్స్ గ్రూప్ అధినేత రాజన్ నందా ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న రాజన్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అమితాబ్ బచ్చన్ తన కుమార్తె శ్వేత బచ్చన్‌‌ను రాజన్ నందా కుమారుడు నిఖిల్ నందాకు ఇచ్చి వివాహం జరిపించిన విషయం తెలిసిందే. కాగా, అమితాబ్  బ్రహ్మాస్త్ర షూటింగ్ కోసం బల్గేరియాలో ఉన్నారు. అయితే, రాజన్ నందా మరణవార్త తెలుసుకుని హుటాహుటిన బల్గేరియా నుంచి స్వదేశానికి వచ్చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ ట్వీట్ చేశారు. ‘‘నా బంధువు రాజన్ నందా, నిఖిల్ తండ్రి, శ్వేత మామగారు ఇప్పుడే కన్నుమూశారు. ఇండియా వెళుతున్నాను’’ అంటూ బిగ్‌బి ట్వీట్‌లో పేర్కొన్నారు.