Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

‘సైరా..’లో బిగ్ బి లుక్

bigb

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా..’. ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్‌బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కథలో నరసింహారెడ్డికి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్ కనిపించనున్నాడు. షూటింగ్ నిమిత్తం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న బిగ్ బి లుక్ టెస్ట్‌లో పాల్గొన్నాడు. దాని తాలూకు ఫొటో ఒకదాన్ని ఆయన తన బ్లాగ్‌లో పోస్ట్ చేశాడు. అందులో అమితాబ్ పొడవాటి గుబురు గడ్డంతో వృద్ధుడి గెటప్‌లో దర్శనమిచ్చి ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఇదే ఆయన ఫైనల్ లుక్ కాకపోయినా సినిమాలో దాదాపుగా ఆయన ఇలాగే కనిపించనున్నాడట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి వంటి స్టార్లు నటిస్తుండగా అమిత్ త్రివేది సంగీతాన్ని అందించనున్నాడు.

Comments

comments