Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

అమిత్ షా ప్రకటన అబద్ధాలమయం

 రాజకీయ దురద్దేశంతో ప్రజలను మభ్యపెట్టడం గర్హనీయం : చాడ 

chada-venkareddyమన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర నిధుల కేటా యింపుల అంశంలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రకటన అబద్ధాలకు అద్దం పడు తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాజ కీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రజల ను మభ్యపెట్టేందుకు ఆయన మాట్లాడిన తీరు గర్హనీయమన్నారు. కేంద్రం రూ.90 వేల కోట్ల సహాయం అందించిందని అమిత్ షా చేసిన ప్రకటనకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అంకెలతో సహా వివరించడం పట్ల చాడ హర్షం వ్యక్తం చేశా రు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశా రు. ఆయా రాష్ట్రాల ప్రజలు సరుకులపైన పరోక్షంగా చెల్లిస్తున్న పన్నుల నుంచి కేంద్రానికి నిధులు సమ కూరుతాయని, 14వ ఆర్థిక సంఘం సిఫా ర్సుల మేరకు రాష్ట్రాలకు జనాభా ప్రకారం కేంద్రం నిధులను కేటాయిస్తుందని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రాలకు నిధులను కేటాయించాల్సిం దేనని ఆయన వివరిం చారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఉన్నం దున రూ.3064 కోట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తే, కేవలం రూ.712 కోట్లు మాత్రమే విడుదల చేసిందని పేర్కొ న్నారు. ఆంధ్రప్రదేశ్ పున ర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వక పోగా కనీసం ప్రత్యేక సహా యం కూడా అందించలేద న్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించి, కరువు నివారణకు చర్యలు ఎందుకు తీసు కోలేదని చాడ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీల కు మూడు నెలల బకాయిలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాతనే నిధులను విడుదల చేసిం దని, దీనికి అమిత్ షా ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రాష్ట్ర బిజెపి నాయకులు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో చర్చకు సిద్ధమని ప్రకటించా రని, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధిం చిన అంశం కాబట్టి వారే సరైన ప్రకటన చేస్తే బాగుంటుందని, అమిత్‌షా అసత్యాల ప్రచారాన్ని రాష్ట్ర బిజెపి నాయకులు ఖండించడం సమంజసమని చాడ వెంకట రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలను తప్పుడు ప్రకటనల ద్వారా మోసగించలేరనే విషయాన్ని బిజెపి నాయకులు గుర్తిస్తే మంచిదన్నారు.

Comments

comments