Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం

Amith-shahమన తెలంగాణ/శంషాబాద్ :  రెండేళ్లలో ఎన్‌డిఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకుపోయి 2019 ఎన్నికల్లో బిజెపి పార్టీని తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని ఆదివారం శంషాబాద్ మండల పరిధిలోని సాతంరామ్ గ్రామంలో జరిగిన బిజేపి మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో బిజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. గత పదేళ్లలో యూపిఎ ప్రభుత్వం  దాదాపు రూ.12 వేల కోట్ల కుంభకోణాలను చేసి ప్రజా ధనాన్ని అడ్డగోలుగా దోచుకుందని ఆరోపించారు. అదే నరేంద్రమోడీ ప్రభుత్వం అవినీతిరహిత మచ్చలేని ప్రభుత్వాన్ని అందించి కాంగ్రెస్‌పాలిత ఆరు రాష్ట్రలో బిజెపి జెండా ఎగరవేసిందన్నారు. గరీబులను ముద్రబ్యాంక్ ద్వారా వ్యాపార వేతను తయారు చేయడానికి రూ.5వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు అందించిందన్నారు. రైతులకు యోజన,పసల బీమా వంటి పథకాలను ప్రవే శపెట్టి అదుకుందన్నారు. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ను అందిం చడానికి,ఎల్‌ఇడి లైట్లను గ్రామీణులకు అందించడానికి రూ.10వేల కోట్ల రూపాయలను ఇస్తుందన్నారు.

బిజెపి జాతీయ కార్యదర్శి రామ్‌లాల్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి పటిష్టం కావడానికి ఇక్కడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టగల సమర్థుడైన నాయకుడు జి .కిషన్ రెడ్డిని శాసన సభ ఫ్లోర్ లీడర్‌గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మరో మూడేళ్లలో ప్రతి ఇంట్లో ఒకరిని బిజెపి కార్యకర్తగా తయారు చేయడానికి కృషి చేయాలన్నారు. కేంద్రమంత్రి దత్త్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీకి భౌవిష్యత్ లేదన్నారు. తెలంగాణలో కుటుంబ పారిపాలన సాగుతుందన్నారు.దేశంలో వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. కేంద్రప్రభుత్వం గ్రామీణ వ్యవసాయానికి రూ.650కోట్లు,గ్రామీణ అభివృద్ది కోసం రూ.40వేల కోట్లు,దేశంలోని అసంఘటిత కార్మికులకు 4వేల కోట్లు అందిస్తుందన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ పల్లె పల్లెకు బిజెపి ఇంటి ఇంటికి నరేంద్రమోడీ అనే నినాదంతో గ్రామాలకు కార్యక ర్తలు ప్రచారం చేయాలన్నారు. దేశంలో రాహుల్ గాంధి ఆద్వార్యంలో కాంగ్రెస్ పార్టీ తిరోగమన దిశలో ప్రయాణిస్తుంటే నరేంద్రమోడీ నాయ కత్వంలోని బిజెపి కమలం లా వికసిస్తుందన్నారు.

అట్టడుగు స్థాయి ప్రజ లకు సైతం ప్రభుత్వ ఫలాలను అందించిన ప్రభత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క నరేంద్రమోడీ ప్రభుత్వమే అన్నారు. కులమ తలను, వర్గాలను పెంచిపోషించి రాజకీయలు చేసే కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలో మచ్చ లేని పాలన దేశంలో అందించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే నరేంద్రమోడీ ప్రభుత్వం అన్నారు. తెలంగాణలోని కరువు పరిస్థితులను ఎదుర్కోడానికి నరేంద్రమోడీ రూ.791కోట్లను ఇస్తే ఇక్కడి ప్రభుత్వం మాత్రం ఒక్క పైసా ఖర్చు పెట్టాకుండా ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యారని ఆరోపించారు. అదే మహరాష్ట్రలో పశువులు చనిపోతే బీమా కల్పిస్తుంటే ఇక్కడ పశువులు మృతి చెందుతుంటే మీనమేశలు లెక్కిస్తుందని ఆరోపించారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంను పెంచిపోషిస్తే ఇప్పుడు టీఆర్‌ఎస్ సైతం అదే పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామ్‌చంద్ర రెడ్డి,ప్రబాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గంగా రెడ్డి, బద్దం బాల్ రెడ్డి,దినేష్ రెడ్డి,రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు బోక్క నర్సింహ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments